టిడబ్ల్యు జెెె ఎఫ్ పాదయాత్రను అనుమతించండి.. కోర్టు ఆదేశం
posted on Sep 21, 2022 @ 3:46PM
తెలంగాణా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టిడబ్ల్యుజెెె ఎఫ్) మహబూబ్‌నగర్ నాయకుడు వి.అశోక్ కుమార్ పాదయాత్రకు అనుమతించాలని సైబరాబాద్, హైదరాబాద్, సిపిలు, మహబూబ్‌నగర్ ఎస్‌పీకీ బుధ వారం తెలంగాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఆదేశాలు జారీ చేశారు. వి.అశోక్ కుమార్ సెప్టెం బర్ 25 నుంచి 30 తేదీవరకూ మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ కు పాదయాత్ర చేయను న్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో జారీచేసిన జీఓ 424, 2008 ప్రకారం జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వా లని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తమ ఫెడరేషన్ తరఫున ప్రతిపాదనను అందచేయ డానికి అశోక్ కుమార్ పాదయాత్ర చేయతలపెట్టినట్టు హైకోర్టుకు పిటిషన్ దాఖలు చేశారు. 2008 జీఓ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2010లో త్రోసిపుచ్చారు. కాగా ఇటీవల మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్, దేశంలో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలను కేటాయిం చాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.