ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై వెల్లువెత్తుతున్న నిరసనలు
posted on Sep 22, 2022 7:40AM
తాటిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడగట్టి కోసం అన్నడట అన్నది సామెత అలాగే ఉంది ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుకు కారణమేమిటంటే జగన్ ఎన్టీఆర్ డాక్టర్ కాదు కనుక ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్పడం. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంతో జగన్ పాపాల లెక్క పరిమితి దాటేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజలలో ఆగ్రహాన్ని నింపాయనీ.. అయితే ఎన్టీఆర్ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం ప్రజలలో ఆయన పట్ల ఏహ్య భావాన్ని కలిగించిందని అంటున్నారు.
విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఇదే పంథా అనుసరించి ఉంటే.. జగన్ పాదయాత్ర చేయగలిగే వారా? వైఎస్ పేరు ఏపీలో ఎక్కడైనా కనిపించనిచ్చే వారా? అని జనం ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై ప్రజలలో ఆగ్రహం, జగన్ సర్కార్ పట్ల వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ నుంచి కొనసాగుతున్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చేందుకు బుధవారం (సెప్టెంబర్ 21)న అసెంబ్లీ ఆమోదం తెలపడం రాష్ట్రంలో రాజకీయ రచ్చ రేపింది. ఎన్టీఆర్ హెల్త్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చే నిర్ణయంపై ఈ నిర్ణయంపై తెలుగు దేశం సహా అన్ని రాజకీయ పార్టీలు, అన్న విర్గాల ప్రజలూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆఖరికి వల్లభనేని వంశీ లాంటి జగన్ భక్తులు కూడా ఈ విషయంలో పునరాలోచించాలని సీఎంను కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి డాక్టర్ ఉంది ఎన్టీఆర్ డాక్టర్ కాదు. అందుకే పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నానని జగన్ చెబుతున్నారు. అలాగూ వైద్యాన్ని పేదలకు చేరువ చేసిన ఆరోగ్యశ్రీ పథకం వైఎస్ ప్రవేశపెట్టారనీ ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చిన ఘనత వైఎస్ దేననీ అందుకే పేరు మార్చాననీ అంటున్నారు. అయితే పేరు మార్పు నిర్ణయంపై జగన్ ఇచ్చిన వివరణ, చేసుకున్న సమర్థన ఎవరూ అంగీకరించడం లేదు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై ఏపీలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలోనూ నిరసన వ్యక్తమౌతోంది. వైఎస్ తనయుడిగా తన తండ్రి పేరును సంస్థలకు పెట్టాలంటే.. తాను స్థాపించన సంస్థలకు పెట్టు కోవాలనీ.. అంతే కానీ ఎవరో కట్టిన ఇంటిని కబ్జా చేసినట్లు మహానుభావుల పేర్లను మార్చేయడం ఎంత మాత్రం సబబు కాదనీ అంటున్నారు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్కటంటే ఒక్క సంస్థను స్థాపించిన పాపాన పోలేదనీ, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తన ఖాతాలో వేసుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంతో జగన్ తన పతనానికి తానే బాట వేసుకున్నట్లుందని విమర్శకులు అంటున్నారు.