అమాయకులను చంపడానికే వచ్చా.. టెర్రరిస్ట్ షాకింగ్ విషయాలు

కాశ్మీర్లోని కుప్వారా జిల్లా నౌగామ్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్లో భద్రతా బలగాలకు బహదూర్ ఆలీ అలియాస్ సైఫుల్లా అనే ఓ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతనిని విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థకు.. బహదూర్ అలీ చెప్పే విషయాలను వింటుంటే దిమ్మతిరిగిపోతుంది. ‘నేను కశ్మీర్‌కు సాధారణ, అమాయక జ‌నాల‌ని హ‌త‌మార్చేందుకు వ‌చ్చా.. గెరిల్లా వార్ ఫేర్ లోని లష్కరే తోయిబాలో శిక్షణ తీసుకొన్నా’ అని అలీ తెలిపాడు. ‘ఆ త‌రువాత జమాత్ ఉద్ దవా (జుద్) ఛీఫ్ హఫీజ్ సయీద్ ను రెండు సార్లు క‌లిశా, పాకిస్థాన్‌లోని కంట్రోల్ రూమ్ తో నేను నిత్యం ట‌చ్‌లోనే ఉంటా’ అని అన్నాడు.   కాగా గత వారం ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. బహదూర్ ఆలీ ప్రాణాలతో చిక్కాడు. అతని దగ్గర నుండి మూడు ఏకే-47 రైఫిల్స్, రెండు తుపాకులు, 23 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

అరుణ్ జైట్లీ సన్నాయి నొక్కులు.. మళ్లీ ఏపీకి కుచ్చుటోపి..

  రాజ్యసభలో ఏపీ ప్రత్యేక ప్రైవేటు బిల్లుపై చర్చ ప్రారంభమైంది. ఈసారి కూడా కేంద్రం ఏపీ నెత్తిన కుచ్చుటోపీ పెట్టినట్టే కనిపిస్తోంది. అరుణ్ జైట్లీ సన్నాయి నొక్కులు..నిబంధనల సాకుతో ఏపీ నోట్లో మళ్లీ కేంద్రం మట్టి కొట్టింది. కుంటిసాకులతో ప్రత్యేక హోదాకు మంగళం పాడింది. ప్రత్యేక హోదాపై జైట్లీ మాటలు వింటే ఇదే విషయం అర్ధమవుతుంది. ఏపీ ప్రత్యేక హోదా విషయంపై ఆయన మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అనేది చాలా సున్నితమైన అంశం.. అసలు ఏపీకి ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేదు.. అలాగని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పడం లేదు...అప్పటి ప్రధాని హామీ ఇచ్చారు కాబట్టి ఆలోచిస్తున్నాం.. అని అన్నారు. అంతేకాదు చంద్రబాబు పాలనాదక్షతతో.. ప్రజలు స్వయం కృషితో ఎప్పటికైనా..ఏపీ స్వాలంభన సాధిస్తుంది అని చెప్పుకొచ్చారు. బెంగాల్, కేరళలతో పాటు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అన్నారు.   మరోవైపు అరుణ్ జైట్లీ సమాధానంతో విపక్షాలు పెదవి విరిచాయి. ఏపీకి ప్రత్యేక హోదాపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని కోరాయి. ఎంపీ సీఎం రమేశ్.. సీతారం ఏచూరి స్పందిస్తూ.. అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా..? లేదా..? అన్న విషయం తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. జైట్లీ ఆన్సర్ మరింత గందరగోళానికి దారి తీసేలా ఉందని సీతారాం ఏచూరి అన్నార. కేవీపీ రామచంద్రరావు స్పందించి ఈ సమాధానాన్ని అంగీకరించడం లేదని వ్యాఖ్యానించారు. ఇంకా జైట్లీ వ్యాఖ్యలను తప్పుబట్టిన దిగ్విజయ్ సింగ్, హోదా ఇవ్వకుంటే, ప్రజల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ, జైట్లీ సమాధానాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి సభ నుంచి వాకౌట్ చేశారు. మొత్తానికి ఈసారి కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది.. లేనిది చెప్పకుండా.. గత ప్రభుత్వంపై నెడుతూ కేంద్రం మరోసారి ఏపీ చెవిలో పెద్ద పువ్వే పెట్టింది.

మోడీకి ప్రాణహాని.. బుల్లెట్‌ప్రూఫ్ ఎన్‌క్లోజ‌ర్ వాడాల్సిందే..

  భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రాణాలకు ముప్పు ఉందా..? అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. అందకే ఈసారి స్వతంత్ర దినోత్సవంనాడు ఆయన ప్రసంగాన్ని బుల్లెట్ ప్రూఫ్ ఉన్న ఎన్‌క్లోజ‌ర్‌లో నుంచే ఇవ్వాలని సూచిస్తున్నాయి. అయితే గతంలో మోడీ మాత్రం ఎటువంటి భద్రతా ఎర్పాట్లు లేకుండానే..నార్మల్ గా ప్రసంగం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే ఉందని..  క‌శ్మీర్ అల్ల‌ర్లు, దేశంలోకి చొర‌బాట్లు పెరిగిపోవ‌డం.. అది కాకుండా.. ఐఎస్‌తోపాటు అల్‌ఖైదా, ల‌ష్క‌రే తోయిబా, జైషే మ‌హ్మ‌ద్‌, హిజ్బుల్ ముజాహిదీన్‌లాంటి ఉగ్ర‌వాద సంస్థ‌ల నుంచి మోదీకి ముప్పు పెరిగిపోవ‌డంతో డ్రోన్ల ద్వారా కూడా మోడీకి ప్రాణ హాని ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఈసారి స్వ‌తంత్ర దినోత్స‌వాల‌కు క‌నీవినీ ఎర‌గ‌ని రీతిలో భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల‌ని నిర్ణయించారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆయ‌న‌కు బుల్లెట్‌ప్రూఫ్ ఎన్‌క్లోజ‌ర్ ఏర్పాటు చేయాల‌ని భ‌ద్ర‌తాధికారులు భావిస్తున్నారు.

పోలీసులకి చిక్కిన దయాశంకర్ సింగ్..

  బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ అభ్యంతర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఇక దీనిపై స్పందించిన బీజేపీ పెద్దలు.. తనను పార్టీ నుండి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేశారు. అప్పటి నుండి దయాశంకర్ సింగ్ తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయనను పోలీసులు బీహార్లో అరెస్ట్ చేశారు. జార్ఖండ్‌లోని ఓ శివాల‌యం ద‌గ్గ‌ర ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో రావ‌డంతో అప్రమత్తమైన పోలీసులు.. యూపీ, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఆయ‌న కోసం వెతికారు. శుక్ర‌వారం బ‌క్స‌ర్‌లో ద‌యాశంక‌ర్‌ను అరెస్ట్ చేశారు.   కాగా దయాశంకర్ సింగ్ మాయావతిని వేశ్యతో పోల్చుతూ కామెంట్లు చేసిన సంగతి విదితమే. 'డబ్బులు తీసుకున్న వేశ్య కూడా తాను ఒప్పుకున్న పనికి కట్టుబడి ఉంటుంది. మాయవతి ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టిక్కెట్లు అమ్మేస్తున్నారు' అని వ్యాఖ్యానించారు

జీఎస్టీ బిల్లుకు మూహూర్తం వచ్చే వారమే..

  జీఎస్టీ బిల్లును ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుండో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకపక్క లోక్ సభలో బిల్లుకు ఆమోదం లభించినా.. రాజ్యసభలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ బిల్లుకు ప్రతిపక్షపార్టీ అయిన కాంగ్రెస్ అడ్డుకట్టగా మారింది. ఈ బిల్లుకు సంబంధించి గతంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కూడా మంతనాలు జరిపారు. అయితే అప్పుడు కాంగ్రెస్ కొన్ని షరతులు పెట్టినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుంది. వచ్చే వారమే బిల్లును సభలో ప్రవేశ పెట్టి ఆమోదంపొందడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే బిల్లులో రెండు కీలక సవరణలు చేసిన నేపథ్యంలో.. అభ్యంతరం వ్యక్తం చేసిన పార్టీలన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా..బిల్లుపై చ‌ర్చ‌లు స‌రైన దిశ‌లోనే న‌డుస్తున్నాయ‌ని అన‌డంతో ఇక జీఎస్టీకి స‌భ ఆమోదం ల‌భించ‌డం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మెలిక పెడుతుందో..

వ్యవసాయంతో పేదరికాన్ని నిర్మూలించవచ్చు-చంద్రబాబు

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం వల్ల పేదరికాన్ని నిర్మూలించవచ్చన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ వ్యవసాయశాఖ అధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి మాట్లాడిన ఆయన రైతుల సేవే మాధవ సేవేగా భావించాలన్నారు. నదుల అనుసంధానం, నీరు-చెట్టు, చెరువుల మరమ్మత్తులతో భూగర్భ జలాలు గత ఏడాది కన్నా బాగా పెరిగాయన్నారు. వచ్చే నెల 6న అనంతపురంలో రైతు ఉత్పత్తి సమాఖ్యను ప్రారంభిస్తామని, ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల పోస్టులను భర్తీ చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. 

ఢిల్లీ ప్రజలను బయటకు రావొద్దన్న అధికారులు...

దేశ రాజధాని ఢిల్లీ భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు డ్రైన్‌లు పొంగిపోర్లుతున్నాయి. నీరు ఇంకే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడ చూసినా మూడు నుంచి నాలుగడుగుల్లోతు నీరు ప్రవహిస్తోంది. దీంతో ఎటూ కదల్లేని స్థితిలో వందలాది వాహనాలు రహదారులపైనే నిలిచిపోయాయి. ఢిల్లీ నుంచి గుర్గావ్ వైపు వెళ్లే ప్రధాన రహదారి సహా, అన్ని మార్గాలు మూసుకుపోయాయి. సెంట్రల్, దక్షిణ ఢిల్లీలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. అప్రమత్తమైన అధికారులు ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావద్దొని పోలీస్ శాఖ ట్వీట్ చేసింది. ఎప్పుడు ఏ వార్త తెలిసినా దానిని సోషల్ మీడియాలో పోస్ట చేయడం హబీగా మారిన ఈ రోజుల్లో ఢిల్లీలోని కష్టాలను అక్కడి యువత సోషల్ మీడియాలో పెడుతున్నారు. క్యాబ్‌కు బదులు బోటును పంపితేనే ఆఫీసులకు వస్తామంటూ నెటిజన్లు జోకులు పెలుస్తున్నారు.

కేజ్రీవాల్ నన్ను చంపాలని చూస్తున్నారు..

  ఒకపక్క ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోడీ నన్ను చంపించాలని చూస్తున్నారని ఆరోపిస్తుంటే.. ఇప్పుడు ఏకంగా కేజ్రీవాల్ నన్ను చంపడానికి చూస్తున్నారని.. సొంత పార్టీ నేత.. మాజీ మంత్రి ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేశారు. అసలు సంగతేంటంటే.. ఆహార, పౌరసరఫరాల, పర్యావరణ శాఖల బాధ్యతలు చేపట్టిన అసీమ్ అహ్మద్ ఖాన్ ను లంచం తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ నుండి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన కేజ్రీవాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ నిజ స్వరూపానికి సంబంధించిన ఆడియో, వీడియో టేపులు నా దగ్గర కొన్ని ఉన్నాయి.. అందుకే కేజ్రీవాల్ నన్ను చంపాలని చూస్తున్నారని.. గత తొమ్మిది నెలల నుండి నాపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.. చంపుతామని ఫోన్లలో బెదరిస్తున్నారని, వ్యక్తిగతంగానూ వచ్చి హెచ్చరికలు జారీ చేశారని, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశానని ఖాన్ వెల్లడించారు. దీని గురించి కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జంగ్ లకు లేఖలు రాశానని తెలిపారు.   ఇదిలా ఉండగా ఖాన్ చేసే ఆరోపణలను ఆప్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. ఆయన కావాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారు.. అంతకు మించి ఏం లేదు అని అంటున్నారు.

జానారెడ్డి, షబ్బీర్ అలీ అరెస్ట్...

తెలంగాణ ప్రభుత్వం నిర్మించదలచిన మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు ప్రజల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే రైతులు నిరసన వ్యక్తం చేయగా పోలీసులు వారిపై లాఠీ ఛార్జి చేశారు. అయితే ఇప్పుడు ఆ రైతులను పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలు  కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి  రైతులను పరామర్శించడానికి వెళుతుండగా.. మెద‌క్ జిల్లా ఒంటిమామిడి ద‌గ్గ‌ర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకి, నేతలకి మధ్య వాగ్వాదం జరుగగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేష‌న్‌కి త‌ర‌లించారు.

అమెరికా పతనమే ట్రంప్ కోరిక-హిల్లరీ క్లింటన్

అగ్రరాజ్యంలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తరపున ఆ దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారు కాగా..డెమొక్రటిక్ పార్టీ తరపున అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి, మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ బరిలోకి దిగుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్న తొలి మహిళగా హిల్లరీ రికార్డు సృష్టించారు. ఇక ట్రంప్‌పై విజయం సాధిస్తే..అమెరికాకు తొలి మహిళా దేశాధ్యక్షురాలిగా ఆమె చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఫిలదెల్పియాలో జరుగుతున్న డెమొక్రటిక్ పార్టీ కన్వెన్షన్‌లో హిల్లరీ ఉద్వేగంగా ప్రసంగించారు. తన ప్రత్యర్థి ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. అమెరికా విచ్ఛిన్నాన్ని ట్రంప్ కోరుకుంటున్నారని ఆమె ఆరోపించారు. తన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించని ట్రంప్ అమెరికాను అభివృద్ధి బాటలో ఎలా నడిస్తారని హిల్లరీ ప్రశ్నించారు. జేబులో తుపాకులు పెట్టుకునే వ్యక్తికి అధ్యక్ష పదవిని ఎలా కట్టబెట్టాగలరంటూ విమర్శించారు.

చరిత్ర సృష్టించిన హిల్లరీ క్లింటన్..

  త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ ఖరారు కాగా.. ఇప్పుడు డెమొక్రటిక్ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్ ఖరారయ్యారు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన తొలి మహిళగా హిల్లరీ చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ట్రంప్ పై విమర్శల బాణాలు వదిలారు. అమెరికా విచ్ఛిన్నాన్ని ట్రంప్.. ట్రంప్ ను నమ్మొద్దని ఆమె అమెరికన్లకు సూచించారు. ట్రంప్ కు అమెరికా కంటే స్వప్రయోజనాలే ముఖ్యమని కూడా హిల్లరీ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే బరిలో నిలిచిన తొలి మహిళగా హిల్లరీ చరిత్ర సృష్టించగా.. ఇక ఈ ఎన్నికల్లో కూడా గెలిస్తే అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టిస్తారు. కాగా ఈ ఏడాది నవంబర్ లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

తెలంగాణ జడ్జిలపై సస్పెన్షన్ ఎత్తివేత..

తెలంగాణ జడ్జిలపై విధించిన సస్పెన్షన్‌ను ఉమ్మడి హైకోర్టు ఎత్తివేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ భోస్లే నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి హైకోర్టు విభజన, సీమాంధ్ర న్యాయాధికారులకు ఆప్షన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జడ్జిలు, న్యాయవాదులు ఆందోళనకు దిగడంతో పాటు మూకుమ్మడిగా రాజీనామాలను చేశారు. అనంతరం ర్యాలీగా గవర్నర్‌ను కలవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గన్‌పార్క్ వద్ద నిరసన తెలిపి గవర్నర్‌ని కలిసి తమ డిమాండ్లను వివరించారు. అయితే, న్యాయాధికారులుగా ఉండి రోడ్డెక్కడంపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. క్రమశిక్షణా చర్యల కింద 11 మంది న్యాయాధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో సమ్మెను మరింత ఉధృతం చేశారు న్యాయాధికారులు. అయితే గవర్నర్, ఏసీజే హామీతో జూలై 5న వారు సమ్మె విరమించారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి భోస్లే బదిలీపై వెళుతున్న చివరి రోజునే ఆయన న్యాయాధికారులు వరప్రసాద్, రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్ ప్రసాద్, రామాకాంత, డా.సున్నం శ్రీనివాసర్ రెడ్డి, జి.వేణు, ఎం.రాధాకృష్ణ, పి.రాజు, మురళీధర్, ఎస్.సరిత, ఆర్.తిరుపతిలపై విధించిన సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు.

యువకుడిని చితక్కొట్టి..వీడియో తీయించిన తృప్తి?

పురుషులతో సమానంగా మహిళల్ని కూడా శనిసింగనాపూర్, త్రయంబకేశ్వర్ లాంటి ఆలయాల్లో ప్రవేశం కల్పించాలని పోరాడిన భూమాత బ్రిగేడ్ అధ్యక్షురాలు తృప్తిదేశాయ్ మరోసారి వార్తల్లోకెక్కారు.  పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని నడిరోడ్డుపై చితకబాదారు తృప్తి. లాంధే అనే వ్యక్తి 24 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.   బాధితురాలు గర్భం దాల్చడంతో ఆమెకు బలవంతంగా అబార్షన్ చేయించాడు. దీంతో బాధితురాలు పోలీసుల దగ్గరకు వెళ్లిందని..అయితే లాంధే ఆమెను పెళ్లి చేసుకుంటానని సర్దిచెప్పడంతో ఎలాంటి ఫిర్యాదు చేయలేదు..అయితే లాంధే మరోసారి మాటతప్పడంతో సదరు మహిళ తనను కలిసిందని..దీంతో నిందితుడికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నానని తృప్తిదేశాయ్ తెలిపారు. వెంటనే అతన్ని నడిరోడ్డుపైకి యిడ్చి తృప్తి చెప్పుతో చితకబాదారు..అంతేకాకుండా ఈ ఘటనను వీడియో తీయించి అందరికి పంచారు. మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా వూరుకునేది లేదని..అందుకోసం చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికైనా వెనుకాడబోనని తృప్తి అన్నారు.

రచయిత్రి మహాశ్వేతా దేవీ అస్తమయం..

ప్రముఖ కవయిత్రి, సామాజిక ఉద్యమకారిణి మహశ్వేతా దేవీ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1926 జనవరి 14న అవిభక్త భారతదేశంలోని ఢాకా(ప్రస్తుత బంగ్లాదేశ్ రాజధాని)లో మహశ్వేతా దేవీ జన్మించారు. మొదటి నుంచి సాహితీ వేత్తల కుటుంబం కావడంతో ఆ ప్రభావం శ్వేతా దేవీపై పడింది. ఆమె విద్యాభ్యాసం ఢాకాలోనే పూర్తయ్యింది. దేశ విభజన తర్వాత వారి కుటుంబం వారి కుటుంబం కోల్‌కతాలో స్థిరపడింది.   అనంతరం రవీంద్రుని విశ్వభారతీ విశ్వవిద్యాలయంలో బీఏ, కోల్‌కతా యూనివర్శిటీలో ఎంఏ ఇంగ్లిష్‌ను పూర్తి చేశారు. బిజాన్ భట్టాచార్య అనే ప్రముఖ నాటక రచయితను ఆమె వివాహం చేసుకున్నారు. శ్వేత రచించిన హజార్ చౌరాసిర్ మా, బ్రెస్ట్ స్టోరీస్, టిన్ కోరీర్ సాధ్ వంటి రచనలను సినిమాలుగా కూడా తెరకెక్కించారు. మరో సామాజిక ఉద్యమకారిణిగా గిరిజన ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేశారు. వివిధ రంగాల్లో శ్వేతాదేవీ చేసిన సేవలకు గానూ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు, పద్మవిభూషణ్, జ్ఞాన్‌పీఠ్, మెగసెసె తదితర అవార్డులు ఆమెను వరించాయి. శ్వేతాదేవీ మరణం పట్ల పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం తెలిపారు.

మోడీజీ ఆ 100 రూపాయలు ఏమైనట్లు..?

ఎన్డీయే హయాంలో ధరల పెరుగుదలపై లోక్‌సభలో రాహుల్ చేలరేగిపోయారు. ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరిగారు. పలు ఆహార ధాన్యాల ధరలను, ప్రభుత్వం వసూలు చేస్తున్న ట్యాక్సులను ప్రస్తావించారు. రైతుల నుంచి ప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంత మొత్తం దోచుకుంటోందీ వివరించారు.   యూపీఏ హయాంలో పప్పు ధరలో మార్కెట్ రేట్‌కి, రైతుల నుంచి కొనుగోలు రేటుకీ మధ్య కేవలం 30 రూపాయల వ్యత్యాసం ఉండేదని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యత్యాసం 130 రూపాయలకు పెరిగిందని అన్నారు. ఆ 100 రూపాయలు ఎవరు తింటున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రమాణ స్వీకారం రోజున ప్రధానిగా కాకుండా..సేవకుడిగా ఉండాలనుకుంటున్నానని ప్రకటించిన మోడీగారు, ప్రజలకు ప్రధానంగా రైతులకు చెందిన భూములను పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు మూడు సార్లు సవరణకు ప్రతిపాదించారని రాహుల్ ఆరోపించారు. మరీ ప్రధాని దేశానికి సేవ చేస్తున్నారా..? లేక పెట్టుబడిదారులకు సేవలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.  

చెట్టు కోసం న్యాయపోరాటం..

దేశంలో తమిళనాడు వాసులది ఒక వైవిధ్యమైన తీరు. అక్కడి వారు ఎవరినైనా అభిమానిస్తే చచ్చేంత వరకు గుండెల్లో నిలుపుకుంటారు. అంతేకాకుండా గుడికట్టి మరి పూజిస్తారు. మనుషుల్నే కాదు చెట్టు, పుట్టను కూడా వీరు అభిమానిస్తారు అనడానికి తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనే నిదర్శనం. చెన్నైకి సమీపంలోని పెరుంగుడిలో వందేళ్ల మర్రిచెట్టు ఒకటి ఇటీవల ఉన్నట్లుండి ఎండిపోసాగింది.   ఏడాది క్రితం వరకు ఎంతో పచ్చగా, ఆరోగ్యంగా ఉన్న చెట్టు ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. దాని ఊడలు ఒక్కొక్కటిగా ఎండిపోసాగాయి. మనమైతే చెట్టు వయసైపోయిందని అందుకే ఎండిపోతుందని వదిలివేసేవాళ్లం..కాని ఆ చెట్టుతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉన్న చుట్టుపక్కలవారు మాత్రం అలా భావించేలేదు. ఆ చెట్టు సరిగ్గా ఓ ఐటీ కంపెనీకి సమీపంలో ఉండటంతో..దాని అడ్డు తొలగించుకోవాలనే దురుద్దేశంతో వారే దానిపై విషప్రయోగం చేసి చంపారని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. దీనిపై హార్టికల్చర్ నిపుణులు సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.