మోడీకి ప్రాణహాని.. బుల్లెట్‌ప్రూఫ్ ఎన్‌క్లోజర్ వాడాల్సిందే..
posted on Jul 29, 2016 @ 3:51PM
భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రాణాలకు ముప్పు ఉందా..? అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. అందకే ఈసారి స్వతంత్ర దినోత్సవంనాడు ఆయన ప్రసంగాన్ని బుల్లెట్ ప్రూఫ్ ఉన్న ఎన్‌క్లోజర్‌లో నుంచే ఇవ్వాలని సూచిస్తున్నాయి. అయితే గతంలో మోడీ మాత్రం ఎటువంటి భద్రతా ఎర్పాట్లు లేకుండానే..నార్మల్ గా ప్రసంగం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరే ఉందని.. కశ్మీర్ అల్లర్లు, దేశంలోకి చొరబాట్లు పెరిగిపోవడం.. అది కాకుండా.. ఐఎస్‌తోపాటు అల్‌ఖైదా, లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లాంటి ఉగ్రవాద సంస్థల నుంచి మోదీకి ముప్పు పెరిగిపోవడంతో డ్రోన్ల ద్వారా కూడా మోడీకి ప్రాణ హాని ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో ఈసారి స్వతంత్ర దినోత్సవాలకు కనీవినీ ఎరగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు బుల్లెట్‌ప్రూఫ్ ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేయాలని భద్రతాధికారులు భావిస్తున్నారు.