పోలీసులకి చిక్కిన దయాశంకర్ సింగ్..
posted on Jul 29, 2016 @ 3:14PM
బీఎస్పీ అధినేత్రి మాయావతిపై బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ అభ్యంతర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఇక దీనిపై స్పందించిన బీజేపీ పెద్దలు.. తనను పార్టీ నుండి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేశారు. అప్పటి నుండి దయాశంకర్ సింగ్ తప్పించుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు ఆయనను పోలీసులు బీహార్లో అరెస్ట్ చేశారు. జార్ఖండ్‌లోని ఓ శివాలయం దగ్గర ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో రావడంతో అప్రమత్తమైన పోలీసులు.. యూపీ, బీహార్ పోలీసులు సంయుక్తంగా ఆయన కోసం వెతికారు. శుక్రవారం బక్సర్‌లో దయాశంకర్‌ను అరెస్ట్ చేశారు.
కాగా దయాశంకర్ సింగ్ మాయావతిని వేశ్యతో పోల్చుతూ కామెంట్లు చేసిన సంగతి విదితమే. 'డబ్బులు తీసుకున్న వేశ్య కూడా తాను ఒప్పుకున్న పనికి కట్టుబడి ఉంటుంది. మాయవతి ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టిక్కెట్లు అమ్మేస్తున్నారు' అని వ్యాఖ్యానించారు