రాజమౌళికి ఫాదర్ స్ట్రోక్
సక్సెస్ సినిమాలతో టాలీవుడ్లో మోస్ట్ పవర్ఫుల్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్న రాజమౌళికి ఫాదర్ స్ట్రోక్ తగిలింది. సమ్మర్లో సన్ స్ట్రోక్ మామూలే. కానీ కొత్తగా ఈ ఫాదర్ స్ట్రోక్ ఏంటా అని ఆశ్చర్యపోకండి. రాజమౌళి సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఆ సినిమా వార్త ఏది వచ్చినా సినిమా పేజీల్లో హెడ్ లైన్స్‌లో నిలుస్తోంది. అంతే పోటాపోటీగా ఆయన తండ్రి గురించిన వార్తలు కూడా టాప్‌లో నిలుస్తున్నాయి. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ పై ఈ మధ్య అరెస్టు వారెంటు జారీ అయిన సంగతి తెలిసిందే. గతంలో కూడా ఆయనపై ఇలాగే అరెస్టు వారెంట్లు, చెల్లని చెక్‌లు ఇచ్చిన కేసులు అంటూ వార్తలు వచ్చాయి.