Read more!

English | Telugu

పవనూ కాపీ కొడతాడు భయ్యా !!!



'ఆగడు' టీజర్ పవన్, మహేష్ అభిమానుల మధ్య చిచ్చు రాజేసింది. మా హీరోని, మీ హీరో కాపీ చేశాడని పవన్ ఫ్యాన్స్ ప్రిన్స్ ఫ్యాన్స్‌పై తెగ విరుచుకుపడుతున్నారు. బెల్టు నుంచి డైలాగ్ వరకూ అంతా గబ్బర్ సింగ్ లాగే మహేష్ అటైర్ వుందని అభిమానులు గోల పెడుతున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో చర్చలు తారా స్థాయికి చేరుకున్నాయి. పవన్ హిందీ చిత్రాల నుంచి రీమేక్ రైట్‌లు పొంది, సినిమాలు రూపొందించి హిట్లు పొందుతాడని మహేష్ ప్యాన్లు సెటైర్లు వేస్తున్నారు. దానికి ధీటుగా మహేష్ అభిమానులు, మా హీరో చేసిన సినిమాలను హిందీ వాళ్లు రీమేక్ చేసుకుంటున్నారు అని జవాబిస్తున్నారు. హిందీలో వచ్చిన 'దబాంగ్' కి తెలుగు రీమేక్ 'గబ్బర్‌సింగ్' చిత్రం. మహేష్ నటించిన 'పోకిరి' చిత్రం హిందీలో 'వాంటెడ్' పేరుతో రీమేక్ చేశారు. అలా గే మహేష్ నటించిన మరిన్ని చిత్రాలు ఒక్కడు, అతడు హిందీలో రీమేక్ చేయబోతున్నారు. గతంలో కూడా పవన్ నటించిన 'తమ్ముడు' చిత్రం హిందీ చిత్రానికి రీమేక్. ఇలా పవన్ ఎక్కువగా రీమేక్‌లే చేస్తుంటాడని మహేష్ అభిమానులు వాదిస్తున్నారు. ఇలా ఈ హీరోల అభిమానులు తమ తమ హీరోల గొప్పతనం చాటుకోవడానికి రకరకాల చర్చలు, కామెంట్లు చేస్తునే ఉన్నారు. ఈ పోట్లాట ఆగడు టీజర్‌తో మొదలైంది. మరి ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో చూడాలి...