Read more!

English | Telugu

సమంత సోషల్ మీడియా సోష

 
సోషల్ మీడియా వచ్చాక ఎవరూ తమ ఫీలింగ్స్ అసలు దాచుకోవట్లేదు. అన్ని ఎక్సైట్‌మెంట్స్ స్టేటస్ అప్‌డేట్స్ గా మార్చేస్తున్నారు. ఇవి తమ ఫీలింగ్స్, ఎక్సైట్‌మెంట్సే అయితే పరువాలేదు. కానీ, వేరే వాళ్ల సీక్రెట్స్ మన ట్వీట్స్, అప్ డేట్స్ అయినప్పుడే ప్రాబ్లమ్ అంతా. ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తు, హీరోలకి, దర్శకులకి, నిర్మాతలను టెన్షన్ పెడుతుంది సమంత.
 
ఈ ట్విట్టర్ పాప సమంత తాజాగా మళ్లీ రచ్చ చేసింది. ‘అత్తారింటికి దారేది’ టైటిల్ రివీల్ చేసి సినిమా యూనిట్ కి హార్ట్ ఎటాక్ తెప్పించింది అప్పుడు. ‘మనం’ లో అఖిల్ ఎంట్రీ గురించిన సీక్రెట్ కూడా సమంత ట్వీట్ చేసేసింది. ఇప్పుడు లేటెస్టు గా మళ్లీ ట్విట్టర్ లో మరో సినీ సీక్రెట్‌ని సైలెంట్ గా ట్వీట్ చేసింది సమంత. ఈ సారి బెల్లం కొండ సురేష్ కుమారుడుతో సమంత చేస్తున్న సినిమా టైటిల్ అనౌన్స్ చేసేసింది. సినిమా దర్శకుడు వినాయక్, నిర్మాత బెల్లంకొండ కంటే ముందే సినిమా పేరు ‘అల్లుడు శ్రీను’ అంటూ సమంత ట్వీట్ చేసింది. ఈ పాప కొంచెం ముందే కూసేస్తుంటుంది ట్విట్టర్‌లో అని తెలిసినా జాగ్రత్త పడలేక పోయారు ఆ సినిమా యూనిట్. 
 
చక్కగా యాక్టింగ్ చేసుకుంటూ, నీ డైటింగ్ పనుల్లో నువ్వుండకుండా ఈ పీ ఆర్ పనులు నీకెందుకమ్మా అని నచ్చచెప్పాలని  చూస్తున్నారట విషయం తెలిసిన వారు.