Read more!

English | Telugu

కోచ్చడయాన్‌కి వారంలో వందకోట్లు


 
మోషన్ కాప్చరింగ్ టెక్నాలజీలో 3డీ ఫార్మెట్‌లో తెరకెక్కిన తొలి భారతీయ చిత్రం కోచ్చడయాన్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రజనీకాంత్ కుమార్తె సౌందర్య దర్శకత్యం వహించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో  హీరోయిన్‌గా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించింది. ఎన్నో ప్రాముఖ్యతలున్న ఈ చిత్రం ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఇప్పటికే 42 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో 30 కోట్లు, ఇతరదేశాల్లో 12 కోట్ల కలెక్షన్లు కురిపించిన ఈ చిత్రం వారం తిరిగేలోపు వంద కోట్లు వసూలు చేస్తుందని నిర్మాతలు నమ్మకంగా వున్నారు. 
ఆంధ్రప్రదేశ్, ఉత్తరభారత్  మరికొన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం కలెక్షన్లు కొంత తగ్గినా మొత్తంగా అయితే నిరుత్సాహ పడలేదు. రజనీ బ్రాండ్  బాగా పనిచేసే ఆస్ట్రేలియా, మలేషియాల్లో మంచి ఓపెనింగ్స్ దక్కాయి.