Read more!

English | Telugu

రాజమౌళికి ఫాదర్ స్ట్రోక్

 

సక్సెస్ సినిమాలతో టాలీవుడ్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్న రాజమౌళికి ఫాదర్ స్ట్రోక్ తగిలింది. సమ్మర్‌లో సన్ స్ట్రోక్ మామూలే. కానీ కొత్తగా ఈ ఫాదర్ స్ట్రోక్ ఏంటా అని ఆశ్చర్యపోకండి. రాజమౌళి సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఆ సినిమా వార్త ఏది వచ్చినా సినిమా పేజీల్లో హెడ్ లైన్స్‌లో నిలుస్తోంది. అంతే పోటాపోటీగా ఆయన తండ్రి గురించిన వార్తలు కూడా టాప్‌లో నిలుస్తున్నాయి. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ పై ఈ మధ్య అరెస్టు వారెంటు జారీ అయిన సంగతి తెలిసిందే. గతంలో కూడా ఆయనపై ఇలాగే అరెస్టు వారెంట్లు, చెల్లని చెక్‌లు ఇచ్చిన కేసులు అంటూ వార్తలు వచ్చాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌కు పరిశ్రమలో రచయితగా చాలా పేరుంది. అయినప్పటికీ ఈ వార్త కథనాలన్నీ రాజమౌళి తండ్రి అంటూ హెడ్డింగ్‌లు పెట్టడంతో ఇది, రాజమౌళికి హెడ్ ఏక్ గా మారింది. తన పనిలో మునిలా మునిగిపోయే జెక్కన్నకు తండ్రి తాలుకు అరెస్టు కేసులు తెగ ఇబ్బందిగా మారినట్లు తెలుస్తోంది. అందుకే రాజమౌళి ఈ ఫాదర్ స్ట్రోక్ తో బాధపడుతున్నారని టాక్.