Read more!

English | Telugu

కాజల్‌ పెళ్లి అయిపోయిందా !!!


సౌత్‌ సినీ పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్ రేసులో ముందున్న కాజల్ అగ్రవాల్‌కి పెళ్లైనట్లు సమాచారం. తన సోదరి నిషా అగ్రవాల్‌కు వివాహమైన నెల రోజులకే ఆమె వివాహం కూడా జరిగిందని తెలుస్తోంది. ఒక వ్యాపార వేత్తతో ఆమె వివాహం అయినప్పటికీ  ఆ విషయాన్ని వారు గోప్యంగా ఉంచుతున్నారు అని టాక్. కాజల్  'గోవిందుడు అందరి వాడు' అనే తెలుగు చిత్రంతో పాటు మరికొన్ని బాలీవుడ్ చిత్రాలు సైన్ చేసింది. ఆ చిత్రాలు  పూర్తి అయ్యేవరకు కాజల్ పెళ్లి సంగతిని బయటపడనివ్వకూడదని వారి యోచన. ఆ సినిమాలు పూర్తయిన తర్వాత కాజల్ తన వివాహ విషయాన్ని వెల్లడించే అవకాశం వుందని వినికిడి. ఈ విషయం నిజమే అయితే ఎంతో మంది అబ్బాయిల గుండెలు గాయపడటం ఖాయం.