Read more!

English | Telugu

ఎన్టీఆర్‌ని చూసి వాతలు పెట్టుకున్న తారకరత్న



'నేను చాలా వరస్ట్'సినిమా పేరు ఇంత డిఫరెంట్‌గా పెట్టి, చిత్రాన్ని కూడా చాలా భిన్నంగా రూపొందిచడానికి ప్రయత్నిస్తున్నాం అని ప్రకటించారు ఈ చిత్ర యూనిట్ గతంలో. కానీ ఇందులో ఏం డిఫరెంటుగా ఉందో తెలియదు. ఈ గెటప్, ఈ ఫోటోలో పోజు చూస్తే గతంలో వచ్చిన యమదొంగ చిత్రం గుర్తుకు వస్తుంది ఎవరికైనా. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ చిత్రంలో భారీ యమలోకం సెట్‌‌తో రూపొందింది. ఇందులో జూనియర్ యమధర్మరాజుగా యంగ్ ఎన్టీఆర్ కనిపించారు. ఇప్పుడు 'నేను చాలా వరస్ట్' చిత్రంలోనూ తారకరత్న యమధర్మరాజుగా కనిపిస్తాడట. ఇప్పటివరకూ వచ్చిన యమలోకం కాన్సెప్టు చిత్రాలకు ఈ చిత్రం చాలా డిఫరెంటు అని చాటినప్పటికీ, ఈ చిత్రం కోసం వేసిన గెటప్పు, సెటప్పు అలాంటి ఫీలింగ్ అయితే ఇవ్వటం లేదు. ఎన్టీఆర్ ఆల్‌రెడీ చేసిన క్యారెక్టర్ మళ్లీ తారకరత్న చేయడంలో ఏం కొత్తదనం వుందో కనిపెట్టాలంటే చిత్రం విడుదలయ్యే దాకా ఆగాలేమో...