English | Telugu
లడ్డుబాబుతో ఇషా ఇష్‌ష్‌ష్క్
Updated : Jun 7, 2014
కామెడీ సినిమాలు తీస్తు అందరినీ కడుపుబ్బ నవ్విస్తు ఉండటమే తప్ప ఎప్పుడూ ఏ అల్లరి పని చేస్తూ అల్లరి నరేష్ న్యూస్ లోకి రాలేదు. కా నీ ఇప్పుడు అల్లరి నరేష్ ఒక హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడని టాలీవుడ్ లో టాక్ మొదలైంది. అల్లరి నరేష్ సినిమా తర్వాత సినిమా చేస్తూ కొన్ని సార్లు పెద్ద హీరోలకే షాకిచ్చాడు. ఇన్ని సినిమాలు తీస్తున్న అల్లరి నరేష్ సినిమాల్లో రిపీట్ అయిన హీరోయిన్లు చాలా తక్కువ. సినిమా అయిపోయిన తర్వాత వారితో ఎటువంటి కాంటాక్ట్స్ మేయిన్‌టేయిన్ చేయడట.
అమ్మాయిలకు అంత దూరంగా ఉండా ఈ అల్లరి బుల్లోడు ఒక బుల్లెమ్మతో ప్రేమలో పడ్డాడంటూ పుకార్లు మొదలయ్యాయి. అల్లరి నరేష్ లేటెస్ట్ చిత్రం ‘జంప్ జిలానీ’లో డబుల్ రోల్ లో కనిపిస్తున్నాడు. అందులో అల్లరి నరేష్ పక్కన ఇషా చావ్లా, స్వాతి దీక్షిత్ నటిస్తున్నారు. ఈ హీరోయిన్ ఇషా చావ్లా, అల్లరి నరేష్ ల మధ్య చనువు కొంచెం ఎక్కువే వుందంటున్నారు. ఈ మధ్య ‘జంప్ జిలానీ’ సినిమా కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఇషా చావ్లా నరేష్ మీద కాంప్లిమెంట్ల వర్షం కురిపించింది. నరేష్ క్యారెక్టర్ ని డామినేట్ చెయ్యటం ఏ సినిమాలోను జరుగలేదు. కానీ ఈ సినిమాలో నేను డామినేట్ చేశాను అని, తెర వెనుక నరేష్ ఎక్కువ నవ్విస్తుంటారని చెప్పుకొచ్చింది. ఇంతేనా ఇంకా చాలానే వుందని, ఫిల్మ్ నగర్‌లో టాకు...