Read more!

English | Telugu

లబోదిబో మంటున్న బండ్లగణేష్


 
నష్టం వస్తే ఏ నిర్మాతైనా ఇలాగే అంటాడు. అదీ పదికోట్ల నష్టం వస్తే ఇలాగే వాపోతాడు. బండ్లగణేష్ కూడా పదికోట్లు హరీ మనే సరికి ఇలా బెంబేలు పడ్డాడు. అసలు విషయం ఏంటంటే, రామ్ చరణ్ హీరోగా,  కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ఒక కీలక పాత్రకు రాజ్ కిరణ్ ని ఎంపిక చేశారు. అడ్వాన్సులు కూడా ఇచ్చారు. 20 రోజులు షూటింగ్ కూడా జరిపారట. ఆ తర్వాత ఏం అయిందో గాని రాజ్ కిరణ్‌ని పక్కకు పెట్టి అదే పాత్రకు ప్రకాశ్ రాజ్‌ని  తీసుకున్నారు. 20 రోజుల పాటు జరిగిన ఆ ఎపిసోడ్‌ని ఇప్పుడు రీషూట్ చెయ్యాలటా. ఈ తతంగం మొత్తం ఖర్చు పదికోట్లట. మరి నిర్మాత గగ్గోలు పెట్టక ఏంచేస్తాడు. మార్పులు ఏవైనా మనీ మీదే ఎఫెక్టు చూపిస్తాయి కదా... మెగా ఫ్యామిలీ హీరోతో చేస్తున్న ఈ చిత్రంలో నిర్మాతకు ఓ పదికోట్లు అలా ఖర్చయ్యాయి. సినిమా బాగా ఆడితే ఇవన్నీ కొట్టుకుపోతాయి అనుకోండి.. అయినా ఇలాంటి భారీ ఖర్చులతో కూడిన మార్పులు బండ్ల గణేష్ లాంటి వారికి కూడా భారమేనోమో అనిపిస్తుంది.
ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ ఇతర ముఖ్య పాత్రధారులు పోషిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్‌ నిర్మాత