Read more!

English | Telugu

బాబు ప్రమాణస్వీకారానికి ఎన్టీఆర్ వెళ్తున్నాడా!

 
పదేళ్ల తర్వాత టిడిపీ అధికారంలోకి వస్తోంది. జూన్ 8, ఈ ఆదివారం బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లంతా ఆనందసంబరాలలో మునిగితేలుతున్నారు.  నందమూరి వంశానికి చెందిన వారందరూ ఈ వేడుకల్లో పాలు పంచుకుంటున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ బాబు ప్రమాణస్వీకారానికి హాజరు అవుతాడో, లేదో అనే అంశం మీద ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎంటీఆర్ ఈ సారి ఎన్నికల ప్రచారంతో పాటు, ఇటీవల జరిగిన తెలుగు మహానాడుకు కూడా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా ఎంటీఆర్ వస్తాడా లేదా అనే అనుమానం కలుగుతోంది.
 
మరోవైపు ఎన్నికల సమయంలో టిడిపి తరపున ప్రచారం చేసి, పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలో జూనియర్ వెళితే అక్కడ ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది అని ఎంటీఆర్ ఆలోచిస్తుండవచ్చు. కానీ టిడిపీకి ఇంత ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకల్లో పాల్గొనక పోతే  టిడిపీ పార్టీ, నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ దూరమయ్యే అవకాశం వుంది. తలమునకలయ్యే ఈ అంశం నుంచి ఎన్టీ ఆర్ ఒక కొలిక్కి వచ్చి ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.