English | Telugu

నిత్యా మీనన్‌ను లైంగికంగా వేధించిన తమిళ్‌ హీరో! క్లారిటీ ఇచ్చిన నిత్య!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ అనేది కొంతకాలం క్రితం వెలుగులోకి వచ్చింది. ఎంతోమంది హీరోయిన్లు, ఇతర శాఖలకు చెందిన వారు లైంగిక వేధింపులకు గురైన నేపథ్యంలో సింగర్‌ చిన్నయి వంటి వారు దీన్ని వెలుగులోకి తెచ్చి పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు కొత్త నిత్యా మీనన్‌ ఈ విషయంలో ఓపెన్‌ అయింది. సౌత్‌ ఇండియాలోని అన్ని భాషల్లో నటించిన నిత్య నటిగా మంచి పేరు తెచ్చుకుంది. టాలీవుడ్‌లో తనకు ఎలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదని, అందరూ తనతో మర్యాదగానే నడుచుకునేవారని తెలిపింది. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఒక హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, షూటింగ్‌ సమయంలో తనను తాకుతూ హింసించేవాడని చెప్పింది. అలా చేసిన హీరో ఎవరు అనేది మాత్రం నిత్య బయటపెట్టలేదు. అతని ప్రవర్తన వల్ల తను షూటింగ్‌ సరిగా చేయలేకపోయేదాన్నని తెలిపింది. 

మీటూ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఎందరో నటీమణులు తమకు గతంలో జరిగిన లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఈ విషయంపై సింగర్‌ చిన్మయి పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పుడు నిత్యామీనన్‌ వ్యాఖ్యల వల్ల ఆమెకు మంచి సపోర్ట్‌ లభించింది. అయితే నిత్యాను వేధించి ఆ హీరో ఎవరు అనే దానిపై సోషల్‌ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. నిత్యా మీనన్‌పై లైంగిక వేధింపులు జరిగాయని వస్తున్న వార్తల నేపథ్యంలో సినీ క్రిటిక్‌ మనోబాల ఈ విషయాన్ని నిత్యా మీనన్‌ దృష్టికి తీసుకెళ్ళగా,  తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.