English | Telugu
షాకింగ్.. మెగాస్టార్ మూవీ ఆగిపోయింది!
Updated : Sep 20, 2023
రీఎంట్రీ తర్వాత కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్, 'భోళా శంకర్'తో డిజాస్టర్ అందుకున్నారు. 'భోళా శంకర్' షాక్ తర్వాత తన కొత్త సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు చిరంజీవి. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని న్యూస్ వినిపిస్తోంది.
'భోళా శంకర్' తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా, మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది మెగాస్టార్. ఇందులో మొదట కళ్యాణ్ కృష్ణ సినిమా ప్రారంభమవుతుంది అనుకున్నారంతా. ఇది మలయాళ ఫిల్మ్ 'బ్రో డాడీ'కి రీమేక్ అని, ఇందులో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించనున్నాడని వార్తలొచ్చాయి. ఆ తర్వాత సిద్ధు తప్పుకున్నాడని అన్నారు. ఇప్పుడేమో అసలు ఈ ప్రాజెక్ట్ పట్ల చిరంజీవే ఆసక్తి చూపించడం లేదని ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన ప్రస్తుతం తన ఫోకస్ అంతా వశిష్ట సినిమాపైనే పెట్టారని అంటున్నారు. ప్రస్తుతం వశిష్ట ప్రాజెక్ట్ తప్ప చిరు దేనికీ కమిట్ అవ్వలేదట. మరి చిరంజీవి.. కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ కి పూర్తిగా పక్కన పెట్టేశారా లేక వశిష్ట సినిమా పూర్తయ్యాక మరో కొత్త కథతో చేస్తారా అనేది చూడాలి. ఆ మధ్య దర్శకుడు వెంకీ కుడుములకి కూడా ఇలాంటి షాకే ఇచ్చారు మెగాస్టార్. సినిమా చేయడానికి అంగీకరించి, చివరికి డ్రాప్ అయ్యారు. మరి ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.