English | Telugu
ఈసారి బన్ని, అట్లీతో అ సంస్థ భారీ హిట్ కొట్టేందుకు రెడీ అవుతోందా?
Updated : Sep 24, 2023
‘పుష్ప’ సాధించిన ఘనవిజయంతో హీరోగా అల్లు అర్జున్ రేంజ్ ఓ రేంజ్‌లో ఉంది. అతని తదుపరి సినిమా ఏమిటి? ఆ తదుపరి సినిమా ఏమిటి?... ఇలా అతను చేయబోయే సినిమాల విషయంలో ప్రేక్షకులు, అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ కమిట్ అయిన సినిమాలు, కాబోయే సినిమాల విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్‌లో బిజీగా ఉన్న బన్ని నెక్స్‌ట్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా చేస్తాడు. ఈ సినిమా తర్వాత మొదట జైలర్ డైరెక్టర్ నెల్సన్‌తో సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి. చివరికి ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని, ‘జవాన్’ డైరెక్టర్ అట్లీతో సినిమా కన్‌ఫర్మ్ అయ్యిందని న్యూస్ వచ్చింది.
అట్లీతో అల్లు అర్జున్ చేసే సినిమాని నిర్మించే సంస్థ ఏది? అనేది కూడా ఇప్పుడు డిస్కషన్‌లో ఉంది. బన్ని ఎవరికి అవకాశం ఇస్తున్నాడు అనేది హాట్ టాపిక్ అయింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ‘జైలర్’ చిత్రాన్ని నిర్మించి భారీ విజయాన్ని అందుకున్న సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తోంది. ఈ సినిమాకి ఆల్రెడీ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కన్‌ఫర్మ్ అయ్యాడన్న వార్త కూడా వినిపిస్తోంది. అయితే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వచ్చే సినిమా అంటే భారీ అంచనాలే ఉంటాయి. ఇలాంటి భారీ సినిమాని సన్ పిక్చర్స్ లాంటి సంస్థ అయితే సినిమా ఒక రేంజ్‌లో ఉంటుందనేది కొందరి అభిప్రాయం. ఏది ఏమైనా ఈ సినిమా విషయంలో సన్ పిక్చర్స్ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.