English | Telugu

క్రేజీ కాంబో.. మాస్ రాజా సరసన నేషనల్ క్రష్!

'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని నాలుగోసారి చేతులు కలిపారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 1991 లో జరిగిన చుండూరు ఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఇందులో రష్మికా మందన్న హీరోయిన్ గా నటించనుందట.

మొదట ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనుందని వార్తలొచ్చాయి. ఆ సమయంలో రవితేజ-పూజ కాంబో కొత్తగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా రష్మిక పేరు తెరపైకి వచ్చింది. ఇందులో హీరోయిన్ గా రష్మిక ఖరారైందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. విజయ్ దేవరకొండ, నాని, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి హీరోలతో ఆడిపాడిన రష్మికకి రవితేజతో ఇదే మొదటి సినిమా. మరి ఈ పెయిర్ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.