English | Telugu

రాజమౌళి అవుట్ అనిల్ రావిపూడి ఇన్!

హీరోల్లో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు.తన ఒంటి చేత్తో  సినిమాని సూపర్ డూపర్ హిట్ చెయ్యగలిగే సత్తా మహేష్ బాబు సొంతం. అలాగే దర్శకుల్లో రాజమౌళి స్థాయే వేరు.తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి.ఆయన తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు తో చేస్తున్నాడని తెలియగానే మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.కానీ ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి ల సినిమా గురించి బయటికి వచ్చిన  ఒక వార్త మహేష్ అభిమానుల ఆనందాన్ని ఆవిరి చేసింది.

ఇంక అసలు విషయానికి వస్తే మహేష్ ఇప్పటి వరకు 28 సినిమాలు చేసాడు. తన 29 వ సినిమాని రాజమౌళి దర్శకత్వం లో చేస్తున్నాడనే విషయం ఎప్పటినుంచో అందరికి తెలిసిందే.కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో అనిల్ రావిపూడి వచ్చాడనే ఒక రూమర్ సినీ సర్కిల్స్ లో వినపడుతుంది.ఈ న్యూస్ విన్న కొంత మంది అయితే అది నిజమే కావచ్చని ఎందుకంటే రాజమౌళి తన సినిమా కథ విషయంలో చాలా శ్రద్హ తీసుకుంటాడని కథ పూర్తిగా తనకి నచ్చిన తర్వాతే షూట్ కి వెళ్తాడని  అంటున్నారు . పైగా రాజమౌళి సినిమా కి చాలా రోజులు మహేష్ డేట్స్ కేటాయించవలసిఉంటుందని ఈ లోపు మహేష్ ఇంకో సినిమాకి ప్లాన్ చేసి ఉంటాడని కూడా అంటున్నారు.మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శత్వం లో గుంటూరు కారం మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ షూటింగ్ కొన్ని రోజుల్లోనే కంప్లీట్ అవ్వబోతుంది. అలాగే అనిల్ రావిపూడి కూడా బాలకృష్ణ తో భగవంత్ కేసరి  కంప్లీట్ చేసాడు.సో ఇద్దరు కలిసి సినిమా కి ప్లాన్ చేసి ఉండవచ్చని అంటున్నారు .ఏ.కే ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది .సో మహేష్ బాబు ,రాజమౌళి ల కాంబినేషన్ లో వస్తున్న మూవీ మహేష్ 30 వ సినిమాగా భావించవచ్చు.