English | Telugu
అతని కోసం ‘జైలర్’ డైరెక్టర్‌ని పక్కన పెట్టిన అల్లు అర్జున్!
Updated : Sep 21, 2023
అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంతో వరల్డ్‌వైడ్‌గా ఎంత పాపులర్ అయ్యాడో తెలిసిందే. ఇక ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు గెలుచుకోవడంతో బన్నితో సినిమాలు చేసేందుకు సౌత్, నార్త్ ప్రొడ్యూసర్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం బన్ని ‘పుష్ప2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమా చేస్తాడు. ఆ తర్వాత ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్‌తో ఒక సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. అయితే నెల్సన్‌కి బన్ని హ్యాండ్ ఇచ్చాడని తెలుస్తోంది. ఎప్పటినుంచో ఒక కథను బన్నికి వినిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు నెల్సన్. మొత్తానికి కథ వినిపించి ఓకే చేసుకున్నాడు. ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అనుకుంటున్న నెల్సన్‌కి బన్ని షాక్ ఇచ్చాడు.
త్రివిక్రమ్ సినిమా తర్వాత అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాతో సినిమా చేస్తాడని తెలుస్తోంది. నెల్సన్ చెప్పిన కథ కంటే సందీప్ చెప్పిన కథ ఇంకా నచ్చడంతో నెల్సన్‌ని పక్కన పెట్టి సందీప్‌కి ఓకే చెప్పాడు బన్ని. ఈలోగా మరో సినిమా చేసుకోమని నెల్సన్‌కి సలహా ఇచ్చాడట బన్ని. దాంతో తన దగ్గర ఉన్న కథను ధనుష్‌కి వినిపించేందుకు నెల్సన్ సిద్ధమవుతున్నాడని సమాచారం. అయితే ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ, ఈ విషయం మాత్రం వైరల్ అవుతోంది.