English | Telugu
తారక్ కి హీరోయిన్.. బన్నీకి ఐటమ్ డ్యాన్సర్.. ఎవరో తెలుసా!?
Updated : Sep 19, 2023
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఆమె హీరోయిన్. కానీ అదే భామ.. త్వరలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పక్కన ఐటమ్ సాంగ్ చేయబోతోందట. ఈ రెండు కూడా పాన్ ఇండియా ప్రాజెక్టులే కావడం ఇక్కడి విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే.. 'జనతా గ్యారేజ్' తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా 'దేవర' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ నాయికగా నటిస్తోంది. తెలుగులో జాన్వికి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. 2024 ఏప్రిల్ 5న దేవర రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. 'పుష్ప - ది రైజ్'కి కొనసాగింపుగా 'పుష్ప - ది రూల్' పేరుతో అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం విదితమే. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2024 ఆగస్టు 15న రాబోతోంది. కాగా తొలి భాగంలో సమంత స్పెషల్ సాంగ్ హైలైట్ అయినట్టే.. సెకండ్ పార్ట్ లోనూ ఐటమ్ నంబర్ ఎస్సెట్ కానుందట. అంతేకాదు.. ఆ పాటలో జాన్వీని ఫిక్స్ చేశారని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరి.. తారక్ కి హీరోయిన్ గా, బన్నీకి ఐటమ్ సాంగ్ డ్యాన్సర్ గా జాన్వీ ఏ స్థాయిలో ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.