English | Telugu
ముందు నా రేటు తేల్చండి.. కథ తర్వాత వింటాను.. ఇదీ ఆ హీరోయిన్ తీరు!
Updated : Sep 26, 2023
ఒక సినిమా చెయ్యాలంటే ఆ నిర్మాతకు బడ్జెట్ అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్టుల నుంచి టెక్నీషియన్స్ వరకు ఎవరికెంత ఇవ్వాలి? అనేది ముందుగానే లెక్కలు వేసుకుని దాని ప్రకారమే ప్లాన్ చేసుకుంటారు. అయితే ఒక్కోసారి ఆర్టిస్టుల రెమ్యునరేషన్‌లు అనుకున్న దానికంటే పెరిగిపోయి నిర్మాతపై భారం పడుతూ ఉంటుంది. ఈ విషయంలో చిన్న నిర్మాతల కంటే పెద్ద నిర్మాతలకే ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఎందుకంటే తమ సినిమాలో చేసే ఆర్టిస్టులంతా బాగా పాపులర్ అయినవాళ్ళే ఉంటారు. దానికి తగ్గట్టుగానే రెమ్యునరేషన్‌లు కూడా ఉంటాయి.
సాధారణంగా హీరోల రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలకు సమస్య తక్కువగానే ఉంటుంది. హీరోయిన్ల విషయంలోనే ఈ లెక్కలు పెరిగిపోతూ ఉంటాయి. మొదట మాట్లాడుకున్న దానికి రెట్టింపు ఎమౌంట్ హీరోయిన్లకు ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అలా ఓ హీరోయిన్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందట. ఆమె ఎవరనేది పక్కన పెడితే, తను ఏ హీరోయిన్‌కీ తక్కువ కాదని, ఇప్పుడున్న టాప్ హీరోయిన్ల స్థాయిలోనే తనకూ రేటు ముట్టజెప్పాలని పట్టుపడుతోందట. అయినా ఆమెతోనే సినిమా చెయ్యాలని అనుకోవడానికి కారణాలు కూడా లేకపోలేదు. అంతకుముందు ఆమె చేసిన సినిమా కేవలం ఆమె వల్ల ఒక రేంజ్‌కి వెళ్ళాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ హీరోయిన్ రేటు విషయంలో పట్టుపడుతోందట. కథ చెప్పడానికి వచ్చే నిర్మాతలతో కథ ముఖ్యం కాదు, ముందు నా రెమ్యునరేషన్ విషయం తేల్చండి, ఆ తర్వాత కథ వింటాను అంటోందట. ఒక్క సినిమాతోనే హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తన పట్టు సడలించకపోతే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందని ఆమె బాధిత నిర్మాతలు గుసగుసలాడుకుంటున్నారు.