English | Telugu
ఎన్టీఆర్ 'దేవర'లో విజయ్ దేవరకొండ!
Updated : Sep 26, 2023
జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. వీరితో పాటు ఇతర భాషలకు చెందిన పలువులు నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఇందులో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడట.
'దేవర'లో అత్యంత కీలకమైన ఓ పాత్ర ఉందంట. నిడివి తక్కువే అయినప్పటికీ, అది కథను మలుపు తిప్పే బలమైన పాత్రట. ఆ రోల్ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరో చేస్తే బాగుంటుందని మూవీ టీమ్ భావించగా.. విజయ్ పేరుని దర్శకుడు కొరటాల శివ సూచించాడట. ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పడంతో.. వెంటనే మేకర్స్ విజయ్ ని సంప్రదించగా ఆ రోల్ చేయడానికి అతను అంగీకరించినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ఇది క్రేజీ కాంబో అని చెప్పొచ్చు. ఓ వైపు యాక్టింగ్ పవర్ హౌస్, మరోవైపు యూత్ క్రేజీ స్టార్.. ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ప్రేక్షకులకు పండగే అని ప్రత్యేకంగా చెప్పాలా!.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న' దేవర' చిత్రం.. 2024, ఏప్రిల్ 5 ప్రేక్షకుల ముందుకు రానుంది.