English | Telugu
బాలకృష్ణ గురించి వినిపిస్తున్న ఆ వార్త నిజమేనా!
Updated : Sep 27, 2023
నందమూరి తారక రామారావు నట వారసుడుగా సినీ రంగ ప్రవేశం చేసి, తండ్రికి తగ్గ వారసుడు అని అందరు అనుకునేలా చేసిన నటుడు యువరత్న నందమూరి బాలకృష్ణ. హీరోగా, రాజకీయనాయకుడిగా, యాంకర్ గా ఫుల్ బిజీ గా ఉన్న బాలకృష్ణ గురించి ఇప్పుడు ఒక కొత్త వార్త సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.
ప్రస్తుత తెలుగు సినీ పరిశ్రమలో సాంఘిక ,జానపద,పౌరాణిక, ఫిక్షన్ పాత్రలని చేసిన నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క బాలకృష నే అని చెప్పవచ్చు. తన తండ్రి ఎన్టీఆర్ లాగానే అన్ని రకాల పాత్రల్ని పోషిస్తు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయకుడుగా కొనసాగుతున్నాడు. తన తండ్రి ఎన్టీఆర్ లాగానే బాలయ్య డైలాగ్ చెప్తే థియేటర్ మొత్తం విజిల్స్ తో మోత మోగిపోతుంది. సుదీర్ఘ కాలం నుంచి తెలుగు సినిమాకి ఆయన తన నటనతో ఎంతో ఖ్యాతిని కూడా తెచ్చిపెట్టారు. ప్రస్తుతం ఆయన సినిమాలు చేస్తూనే ఇంకో పక్కఎమ్మెల్యే గా కుడా కొనసాగుతూ ప్రజాసేవలో ముందుకు దూసుకుపోతున్నారు. అలాగే ఎవరు ఊహించని విధంగా బాలకృష్ణ హోస్ట్ అవతారం ఎత్తి ఆ రంగంలో కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించారు. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ ఆహలో టెలికాస్ట్ అయిన అన్ స్టాప్ బుల్ షో కి బాలయ్య హోస్ట్ గా వ్యవరించి ఆ షో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ షో లో ఆయన మాట గాంభీర్యం అతిధుల్ని ముక్కుసూటిగా అడిగే ప్రశ్నలు అలాగే మధ్య మధ్యలో తనదైన కామెడీ అండ్ చెణుకులు విసిరి షో ఆధ్యంతం వీక్షకుల కళ్ళకి ఆనందాన్ని కలిగించడంలో బాలయ్య సూపర్ గా సక్సెస్ అయ్యాడు.
మొదటి రెండు సీజన్ లని పూర్తి చేసుకున్న అన్ స్టాప్ బుల్ షో ఇప్పుడు మళ్లీ మూడో సీజన్ కి సన్నాహాలు చేసుకుంటుందనే రూమర్ ఒకటి వినిపిస్తుంది. ఇప్పటికే నిర్వహుకులు బాలకృష్ణ తో చర్చలు జరిపారని బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. సినిమాల పరంగా పొలిటికల్ పరంగాను సీజన్ 2 ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిన విషయమే. నారా చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్ ,లోకేష్, ప్రభాస్ లాంటి వాళ్ళు సీజన్ 2 కి వచ్చి ప్రేక్షకులకి ఆనందాన్ని కలగచేసారు. ఇప్పుడు సీజన్ 3 కూడా అంతకు మించి ఉంటుందని అంటున్నారు. ఈ సీజన్ త్రీ లో మెగాస్టార్ చిరంజీవి, తెలంగాణ ఐ టి మినిస్టర్ కెటిఆర్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తో పాటు మరికొంతమంది రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నారని అంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ ల మధ్య సినిమాలకి సంబంధించి చాలా పోటీ ఉంటుంది. ఇంకో పక్క చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ తో పొత్తు ని ప్రకటించి రాబోయే ఎలక్షన్స్ లో ముందుకు వెళ్ళబోతున్నారు. ఈ క్రమంలో సీజన్ 3 ఉంటుందన్న వార్తలు నిజమైతే కనుక ఎలెక్షన్స్ దగ్గరకొస్తున్న సమయాన అన్ స్టాప్ బుల్ షో సీజన్ 3 కూడా సంచలనం సృష్టించడం గ్యారంటీ.