English | Telugu
‘స్కంద’ ఎఫెక్ట్ : బాలకృష్ణ, బోయపాటిల ‘అఖండ 2’ అటకెక్కినట్టేనా?
Updated : Sep 30, 2023
‘భద్ర’ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన బోయపాటి శ్రీను.. రెగ్యులర్‌గా సినిమాల్లో వుండే యాక్షన్ సీక్వెన్స్‌లతోనే సరిపెట్టాడు. ఆ తర్వాత చేసిన ‘తులసి’లో ఓ రేంజ్‌లో యాక్షన్‌ని టచ్ చేశాడు. ఇక ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో చేసిన ‘సింహా’తో బోయపాటి అసలు స్వరూపం బయటికి వచ్చింది. ఇక ఆ సినిమా నుంచి ప్రతి సినిమాలోనూ కత్తులు కటార్లతో విరుచుకుపడడం మొదలుపెట్టాడు. సినిమా కథ ఏదైనా, కథనం ఏదైనా భారీ యాక్షన్ సీన్స్, రక్తపాతం మామూలే. ఈ తరహా సినిమాలే చేస్తూ వస్తున్న బోయపాటి తాజాగా రామ్ హీరోగా రూపొందించిన ‘స్కంద’లోనూ అదే ఫార్ములాతో వెళ్ళాడు.
‘స్కంద’ రిలీజ్ రోజునే డివైడ్ టాక్ వచ్చింది. కానీ, ఆ తర్వాత డిసైడ్ అయిపోయింది. ఇక సినిమా కష్టం అనే ఏకాభిప్రాయానికి వచ్చారు. సోషల్ మీడియాలో బోయపాటిని ఏమిటీ నరుకుడు అని విమర్శిస్తూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అయితే టాక్‌తో సంబంధం లేకుండా స్కంద వసూళ్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే స్కంద 2 గురించి సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకుంటున్నారు. స్కంద 2 అనగానే బాబోయ్ అంటున్నారు. సీక్వెల్ వర్కవుట్ అవ్వదనే వాదన వినిపిస్తోంది. స్కంద ఎఫెక్ట్ ఇప్పుడు బాలకృష్ణపై పడబోతోందా? అనే డిస్కషన్ కూడా స్టార్ట్ అయింది. ఈ పరిస్థితిలో అఖండ 2 వచ్చినా ఉపయోగం లేదనే వాదన వినిపిస్తోంది. అఖండ 2 సినిమా మీద ఇప్పటివరకు ఉన్న బజ్ స్కంద తర్వాత తగ్గిందంటున్నారు. అఖండ 2 చేయకుండా ఉంటేనే మంచిదని సలహా ఇస్తున్నారు. అఖండలో బాలకృష్ణ చేసిన రెండు క్యారెక్టర్లు బాగా వర్కవుట్ అయ్యాయి. బోయపాటి విషయంలో ప్రతిసారీ అలా జరుగుతుందని చెప్పలేం. అందులో బాలకృష్ణతో మరో కొత్త కథ ట్రై చేస్తే బెటర్ అంటున్నారు నెటిజన్లు.