English | Telugu

‘చంద్రముఖి 2’ ఓటీటీ రైట్స్‌కి ఫ్యాన్సీ ఆఫర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా పి.వాసు దర్శకత్వంలో రూపొందిన ‘చంద్రముఖి’ అప్పట్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌ అయిన 18 సంవత్సరాలకు సీక్వెల్‌ రాబోతోందని అధికారికంగా ప్రకటించిన రోజు నుంచి సినిమాపై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘చంద్రముఖి 2’ ఇటీవల విడుదలైంది. అయితే అందరూ ఆశించిన విధంగా ఈ సినిమా విజయం సాధించలేదు. విడుదలైన తొలి రోజు నుంచే ఈ సినిమాకి డివైడ్‌ టాక్‌ రావడంతో కలెక్షన్స్‌ కూడా అనుకున్న స్థాయిలో సాధించలేకపోయింది. అయితే థియేటర్స్‌లో ఈ సినిమాకి ఆదరణ లభించకపోయినా ఓటీటీలో మాత్రం మంచి డిమాండ్‌ ఏర్పడింది.

‘చంద్రముఖి 2’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్‌తో కొనుగోలు చేసిందని తెలుస్తోంది. దాదాపు రూ. 8 కోట్లు చెల్లించి ఈ రైట్స్‌ పొందిందని సమాచారం. సినిమా రిలీజ్‌ అయిన 45 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చెయ్యాలని మొదట భావించినప్పటికీ థియేటర్లలో ఈ సినిమాకి ఆదరణ లేకపోవడంతో అంతకంటే ముందే ఓటీటీలో రిలీజ్‌ చేసెయ్యాలని భావిస్తున్నారు. ‘చంద్రముఖి 2’ ఓటీటీ రిలీజ్‌కి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడకపోయినప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతోందనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.