English | Telugu
చైతన్యకి మళ్ళీ పెళ్లి..ఈ సారైనా నిలబడేనా?
Updated : Oct 3, 2023
కొణిదల వారి అమ్మాయి నిహారిక పెళ్లి రెండు సంవత్సరాల క్రితం చైతన్య జొన్నలగడ్డ తో అత్యంత వైభవంగా జరిగింది. మెగా అభిమానులతో పాటు మెగా సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరు కూడా నిహారిక,చైతన్యలని ఆశీర్వదించి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని కొనియాడారు. కానీ ఎవరు ఊహించని విధంగా నిహారిక, చైతన్యలు విడాకులు తీసుకొని అందర్నీ షాక్ కి గురి చేసారు .ఇప్పుడు తాజాగా చైతన్య గురించి వస్తున్న ఒక రూమర్ సోషల్ మీడియాని షేక్ కి గురి చేస్తుంది .
రాను రాను సినిమా వాళ్ళ నిజ పెళ్లిళ్లు సినిమాలో లాగానే అబద్ద పెళ్లిళ్లు గా మారుతున్నాయి.పెళ్ళికి ముందు ఒకరి కోసమే ఒకరం పుట్టాం..జీవితాంతం ఒకరి చేయి ఒకరం విడవం అనే లెవల్లో పబ్లిక్ గా తిరగడమే కాకుండా సోషల్ మీడియాలో ఇద్దరి అందమైన పిక్స్ తో ఒక లెవెల్లో రచ్చ రచ్చ చేస్తారు.పెళ్లి కూడా చాలా ఘనంగా జరుగుతుంది అంతేనా పెళ్ళికి వారం రోజుల ముందు నుంచే రక రకాల ఈవెంట్స్ తో ఫుల్ హడావిడి చేస్తారు. ఆ తర్వాత కారణం కూడా చెప్పకుండా తమ మనోభావాలు దెబ్బతిన్నాయని విడిపోతారు. అదేం విచిత్రమో గాని పెళ్లి కి చాలా టైం ఉన్నప్పుడే ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతారు కదా అప్పుడు గుర్తుకు రాని మనోభావాలు పెళ్లయ్యాకే గుర్తుకు వచ్చి విడాకులు తీసుకుంటారు.ఇది ఈ మధ్య కాలంలో సినిమా వాళ్ళు చేస్తున్న పని. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు నీహారిక మాజి భర్త చైతన్య గురించి ఒక తాజా వార్త బయటకి వచ్చింది .ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో లేదో గాని చైతన్య కి పెళ్లి సెటిల్ అయ్యిందని తన దగ్గరి బంధువుల అమ్మాయితో త్వరలోనే పెళ్లి జరగబోతుందనే వార్త బయట షికారు చేస్తుంది. కొన్నాళ్ల క్రితం చైతన్య బాగా డిప్రెషన్లోకి వెళ్లి మాములు మనిషి అవ్వడం కోసం రకరకాల గుడులు, ప్రదేశాలు తిరిగిన విషయం చాలా మందికి తెలిసిందే. చైతన్య ఇప్పుడు డిప్రెషన్ లో నుంచి బయటకి వచ్చాడని పెళ్ళికి కూడా ఒప్పుకున్నాడని అతని శ్రేయోభిలాషులు అంటున్నారు. చైతన్య పెళ్లి విషయంలో వస్తున్న వార్తల్లో నిజమెంతో కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. అలాగే నిహారిక రియాక్షన్ కూడా తెలుస్తుంది.