English | Telugu
మహేష్,షారుఖ్ ఖాన్ మల్టీస్టారర్...ఇది నిజమేనా?
Updated : Oct 2, 2023
కొన్ని కొన్ని కాంబినేషన్ లని వెండి తెర మీద చూడాలంటే ప్రేక్షకులు అదృష్టం చేసుకొని ఉండాలి..కానీ ఇప్పుడు వెండి తెర కూడా అదృష్టం చేసుకోవాలేమో అనే విధంగా ఒక కొత్త కాంబినేషన్ రెడీ కాబోతుందనే ఒక రూమర్ భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తాన్నిషేక్ చేస్తుంది. ఆ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా ? అంచనా వెయ్యకపోతే మీకో చిన్న క్లూ కూడా ఇస్తాను.ఒకరు తెలుగులో సూపర్ స్టార్ అయితే ఇంకొకరు బాలీవుడ్ సూపర్ స్టార్. వాళ్లెవరో చూద్దాం.
సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా సినీ రంగ ప్రవేశం చేసి తండ్రి ఇమేజ్ కి ఎలాంటి భంగం వాటిల్లకుండా తండ్రికి తగ్గ వారసుడు అనిపించుకున్న నటుడు ప్రిన్స్ మహేష్ బాబు. తన ప్రతి సినిమాతో తన రికార్డులని తానే తిరగరాస్తూ టాలి వుడ్ లో అగ్రకధానాయకుడు గా చెలామణి అవుతున్నాడు. మహేష్ బాబు ఇప్పుడు గుంటూరు కారం మూవీలో నటిస్తున్నాడు.శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఒక ముఖ్యమైన క్యారక్టర్ లో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించబోతున్నారనే వార్త ఫిలిం సర్కిల్ లో వినపడుతుంది. ఈ వార్త గురించి చిత్ర బృందం అధికారంగా ప్రకటించకపోయినప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం మహేష్ ,షారుఖ్ లు కలిసి గుంటూరు కారం లో నటించ బోతున్నారని చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ షారుఖ్ ని కలిసి సినిమా సెకండ్ ఆఫ్ లో ఎంటర్ అయ్యే షారుక్ క్యారక్టర్ గురించి చెప్పాడని షారుఖ్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారనే పుకారు షికారు చేస్తుంది.కానీ ఈ పుకారే నిజమైతే మాత్రం ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ సరి కొత్త రికార్డులతో బద్దలు అవ్వాలసిందే. కాగా ఇటీవలే రిలీజ్ అయిన షారుఖ్ మూవీ జవాన్ ని సపోర్ట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా సపోర్ట్ గా నిలిచిన విషయం తెలిసిందే.