English | Telugu
'తమ్ముడు'తో రీఎంట్రీ ఇస్తున్న లయ!
Updated : Oct 6, 2023
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'తమ్ముడు'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సినిమాని సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాతో హీరోయిన్ లయ రీఎంట్రీ ఇస్తుందట.
'స్వయంవరం'తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన లయ.. 'మనోహరం', 'ప్రేమించు', 'హనుమాన్ జంక్షన్' వంటి సినిమాలతో ఆకట్టుకుంది. 30 కి పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె 'తమ్ముడు' సినిమాతో రీఎంట్రీ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అక్కాతమ్ముళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోందని అంటున్నారు. మరి ఇందులో నితిన్ కి అక్కగా లయ కనిపిస్తుందేమో చూడాలి.