English | Telugu
క్రేజీ కాంబో.. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రామ్ చరణ్!
Updated : Oct 5, 2023
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అందులో ఒకటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'గేమ్ ఛేంజర్' కాగా, మరొకటి 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాని చేయనున్నాడు చరణ్. ఇక ఇప్పుడు ఆయన ఓ క్రేజీ బాలీవుడ్ దర్శకుడితో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు రాజ్ కుమార్ హిరానీ.
20 ఏళ్ళ కెరీర్ లో దర్శకుడిగా చేసింది ఐదారు సినిమాలే అయినప్పటికీ, ప్రతి సినిమాతో తనదైన ముద్ర వేసి సంచలన విజయాలను అందుకున్నారు రాజ్ కుమార్ హిరానీ. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో 'డంకి' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత రాజ్ కుమార్ చేయబోయేది చరణ్ సినిమానే అంటున్నారు. మామూలుగా సినిమా సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకునే హిరానీ.. ఈసారి మాత్రం పెద్దగా గ్యాప్ తీసుకోకూడదు అనుకుంటున్నారట. ఇప్పటికే ముంబైలో చరణ్, రాజ్ కుమార్ మధ్య కథా చర్చలు జరిగాయని, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని ప్రచారం జరుగుతోంది.