English | Telugu
అనుపమతో రామ్ పెళ్ళి.. క్లారిటీ వచ్చేసింది!
Updated : Oct 5, 2023
ఫలానా హీరో, ఫలానా హీరోయిన్ ని పెళ్ళి చేసుకోబోతున్నట్లు గాసిప్స్ రావడం సహజం. ఇటీవల రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ పెళ్ళి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది.
రామ్, అనుపమ కలిసి 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురు ప్రేమకోసమే' సినిమాల్లో నటించారు. ఆ సినిమాల షూటింగ్ సమయంలో వీరి మధ్య స్నేహం చిగురించిందని, ఆ స్నేహం కాస్తా తర్వాత ప్రేమగా మారి.. ఇప్పుడు పెళ్ళి పీటలు ఎక్కడానికి సిద్ధమైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా మలయాళ మీడియాలో ఈ న్యూస్ బాగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ వార్తలపై స్పందించిన అనుపమ తల్లి సునీత.. పెళ్ళి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పినట్లు సమాచారం.