English | Telugu
కాంట్రవర్సీ హీరోయిన్‌కి ‘దాని’పై గాలి మళ్లిందా?!
Updated : Sep 27, 2023
ఏ సినిమాకైనా హీరోయిన్ అవసరం. హీరోయిన్ వల్ల సినిమాలు హిట్ అవ్వకపోయినా, గ్లామర్ తోడైతే ఆ సినిమాకు కొత్త అందం వస్తుంది. ఇందులో సందేహం లేదు. హీరోయిన్లు ఎక్కువ శాతం తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతారు. తమకు రావాల్సిన డబ్బు విషయాల్లో అప్పుడప్పుడు వార్తల్లోకి వస్తుంది. ఇక ఇతర విషయాల్లో వేలు పెట్టరు. కానీ, కొందరు హీరోయిన్లు దేశంలో జరిగే ప్రతి ఘటనపై స్పందిస్తారు. ఒక్కో సందర్భంలో ఈ విషయంలో వివాదాల్లో కూడా చిక్కుకుంటారు. అలాంటి వారిలో మొదటి వరసలో ఉండే హీరోయిన్ కంగనా రనౌత్..
ఈమధ్యకాలంలో కంగనా చేసిన సినిమాలేవీ హిట్ అవ్వలేదు. అయితే వివిధ సందర్భాల్లో తన వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా పాపులర్ అయిపోయింది. కొన్ని సున్నితమైన అంశాలపై కూడా ఆమె కామెంట్ చేయడంతో ఆమెను చాలా సందర్భాల్లో టార్గెట్ చేశారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఐదుగురు గన్‌మెన్‌తో ఆమెకు గట్టి భద్రత ఏర్పాటు చేసింది.
ఇంతటి వివాదాస్పద వ్యక్తికి ఇప్పుడు పెళ్ళిపై గాలి మళ్లిందట. త్వరలోనే ఓ బిజినెస్‌మేన్‌ని పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమైంది. ఆ బిజినెస్‌మేన్‌తో డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ జరుగుతుందని, వచ్చే ఏడాది ఏప్రిల్ వివాహం జరుగుతుందని బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కంగనా నటించిన ‘చంద్రముఖి 2’ సెప్టెంబర్ 28న విడుదలవుతుండగా, ‘తేజస్’, ‘ఎమర్జెన్సీ’ చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. తన పెళ్ళి విషయాన్ని కంగనా ప్రకటించలేదు. ఒక క్రిటిక్ ఈ విషయాన్ని వెల్లడిరచడంతో ఇందులో నిజమెంత, అబద్ధమెంత అనేది తెలియాల్సి ఉందని నెటిజన్లు అంటున్నారు.