అనారోగ్యంతోటే 'ఆహుతి'లో అశోక్‌గా నటించి, యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా మారిన రాజశేఖర్!
'ప్రతిఘటన', 'తలంబ్రాలు' సినిమాల తర్వాత రాజశేఖర్‌కు మంచి పేరు తెచ్చిన, ఆయనను యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా మార్చిన మూవీ 'ఆహుతి' (1987). 'తలంబ్రాలు' మూవీని నిర్మించిన ఎం. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి 'ఆహుతి'ని నిర్మించడం, ఆ సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ ఈ సినిమానీ డైరెక్ట్ చేయడం గమనార్హం. 'ఆహుతి' కథ విన్నప్పుడే మంచి చిత్రం అవుతుందనీ, తప్పకుండా హిట్టవుతుందనీ అనుకున్నారు రాజశేఖర్.