English | Telugu

"తీన్ మార్" ఆడియోకి రాజకీయాలు అడ్డు

"తీన్ మార్" ఆడియోకి రాజకీయాలు అడ్డుగా ఉన్నాయని తెలిసింది. "తీన్ మార్" ఆడియో మార్చ్ 21 న విడుదల చేస్తారని మనకు తెలిసిన సమాచారం. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". ఈ "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో రిలీజ్ ని మార్చ్ 21 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ "తీన్ మార్" ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని చాలా భారీగా, అశేష పవర్ స్టార్ అభిమానుల సమక్షంలో జరపాలని నిర్మాత గణేష్ నిర్ణయించారు. కానీ ట్యాంక్ బండ్ పై విగ్రహాలు కూల్చటం వల్ల హైదరాబాద్ లో రాజకీయ పరిస్థితులు బాగా వేడిగా ఉన్నందున ఈ "తీన్ మార్" ఆడియోకి రాజకీయాలు అడ్డుగా మారుతున్నాయనీ, వేలమంది అభిమానులు ఈ "తీన్ మార్" ఆడియోకి వస్తారని అంచనా.