English | Telugu

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వేరు కాపురం

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వేరు కాపురం పెట్టారు. అంటే ఇటీవల పెళ్ళయిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి ఇద్దరూ కలసి వేరు కాపురం పెట్టారు. ఆ ఇల్లు చక్కని బంగ్లా. ఆ బంగ్లా నిండా చక్కని చెట్లూ, పుల మొక్కలు ఉండి చాలా ఆహ్లాదకరంగా ఆ ఇల్లు ఉంటుంది. అలాగే పక్కా వాస్తు ప్రకారం ఆ ఇల్లు కట్టబడింది. మరి ఆ బంగ్లా అల్లు అర్జున్ కి మామగారిచ్చారా...? లేక తన తండ్రి అల్లు అరవింద్ ఇచ్చాడా...? లేక తానే సొంతగా కొనుక్కున్నాడా...? అన్నది ఇంకా తెలియరాలేదు. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి కొత్త దంపతులు. వారు తమకు ప్రైవసీ కావాలనుకున్నారు.

అందుకే ఇలా అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వేరు కాపురం పెట్టినట్లు సమాచారం. అల్లు అర్జున్, స్నేహా రెడ్డి తమ పెళ్ళయిన తర్వాత తిరుపతికి వెళ్ళి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, తిరిగి రాగానే ఇలా వేరు కాపురం పెట్టారట. అలాగే అల్లు అర్జున్ కూడా తన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి కూడా సరైన సమయాన్ని కేటాయించాలని ఆలోచిస్తూ, యేడాదికి రెండు సినిమాల్లో మాత్రమే నటించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.