English | Telugu

"తీన్ మార్" ఆడియోకి రాజకీయాలు అడ్డు

"తీన్ మార్" ఆడియోకి రాజకీయాలు అడ్డుగా ఉన్నాయని తెలిసింది. "తీన్ మార్" ఆడియో మార్చ్ 21 న విడుదల చేస్తారని మనకు తెలిసిన సమాచారం.

వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". ఈ "తీన్ మార్" చిత్రం యొక్క ఆడియో రిలీజ్ ని మార్చ్ 21 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ "తీన్ మార్" ఆడియో రిలీజ్ ఫంక్షన్ ని చాలా భారీగా, అశేష పవర్ స్టార్ అభిమానుల సమక్షంలో జరపాలని నిర్మాత గణేష్ నిర్ణయించారు.

కానీ ట్యాంక్ బండ్ పై విగ్రహాలు కూల్చటం వల్ల హైదరాబాద్ లో రాజకీయ పరిస్థితులు బాగా వేడిగా ఉన్నందున ఈ "తీన్ మార్" ఆడియోకి రాజకీయాలు అడ్డుగా మారుతున్నాయనీ, వేలమంది అభిమానులు ఈ "తీన్ మార్" ఆడియోకి వస్తారని అంచనా. కానీ ఎక్కువ మందితో కూడిన సభలకు పోలీసులు అనుమతి ఇవ్వటం లేదు. లేకుంటే "తీన్ మార్" ఆడియోని అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్మాత గణేష్ అనుకున్నారట. కానీ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రాజకీయ పరిస్థితులు సీరియస్ గా ఉన్న దృష్ట్యా, "తీన్ మార్" చిత్రంయొక్క ఆడియోరిలీజ్ ని ఇన్ డోర్ లోనే జరపాలని అనుకుంటున్నారట. ఈ"తీన్ మార్" చిత్రం ఆడియో మార్చ్ 21 న విడుదల చేసి, ఈ "తీన్ మార్" చిత్రాన్ని మాత్రం ఏప్రెల్ రెండవ వారంలో విడుదల చేయటానికి నిర్మాత గణేష్ సన్నాహాలు చేస్తున్నారు.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.