English | Telugu

మెగాస్టార్ కుమార్తె శ్రీజ భర్త మీద వరకట్నం కేసు

మెగాస్టార్ కుమార్తె శ్రీజ తన భర్త శిరీష్ భరద్వాజ మీద వరకట్నం కోసం తనను వేధిస్తున్నాడని సి సి యస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే మూడేళ్ళ క్రితం తండ్రి ప్రముఖ సినీ హీరో, ప్రముఖ రాజకీయ నాయకుడు, మెగాస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి చిన్నకుమర్తె శ్రీజ తను ప్రేమించిన శిరీష్ భరద్వాజ కోసం తన కుటుంబాన్ని ఎదిరించి మరీ ప్రేమ వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించింది. ఆ పాప జన్మించిన సందర్భంలో మెగాస్టార్ కుటుంబం శ్రీజను దగ్గరకు తీసింది. ఆ తర్వాత ఇటీవల గత కొంత కాలంగా మెగాస్టార్ కుమార్తె శ్రీజ తన భర్త నుంచి దూరంగా ఉంటోందని తెలిసింది.

నిన్న అంటే మార్చ్ 14 వ తేదీన, మెగాస్టార్ కుమార్తె శ్రీజ తన భర్త తనను వరకట్నం కోసం వేధిస్తున్నాడని సి సి యస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ విషయాన్ని ముందుగా లైట్ గా తీసుకున్నారు. కానీ మెగాస్టార్ కుమార్తె శ్రీజ ఒక సీల్డ్ పోలీసులకు అందజేసినట్లు తెలిసింది. ఆ సీల్డ్ కవర్ లో ఏముందనేది ఇంకా తెలియలేదు. ఈ వార్త రాత్రి 8 గంటల వరకూ శాటిలైట్ ఛానల్స్ లో మారుమ్రోగినా, 9 గంటల తర్వాత ఎందుకనో అన్ని ఛానల్స్ ఒక్కసారిగా ఈ వార్తను ఆపేశాయి. మెగాస్టార్ తరపున అలా ఈ వార్త ప్రచారం కాకుండా మేనేజ్ చేసి ఉంటారని సినీజనం అంటున్నారు. ఏది ఏమైనా వరకట్నం వేధింపుల సమస్య అనేది సాధారణ ఆడపిల్లకైనా, మెగాస్టార్ కూతురుకైనా సమానమేనని ఈ సంఘటనతో మరో సారి రుజువయ్యింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.