English | Telugu

"రచ్చ" కోసం రాంబోలా రామ్ చరణ్

"రచ్చ" చిత్రం కోసం రాంబోలా రామ్ చరణ్ తయారవుతున్నాడని సమాచారం. అంటే హాలీవుడ్ చిత్రాలు రాంబో సీరీస్ లో నటించిన సిల్వెస్టర్ స్టాలోన్ వంటి శరీరాన్ని పోందటానికి మన రామ్ చరణ్ మియామీలోని ఆల్ట్రా మోడరన్ జిమ్ లో ట్రైనింగవుతున్నాడు.

రామ్ చరణ్ హీరోగా నటించిన రెండవ చిత్రం "మగధీర"లోనే తన కండలు తిరిగిన శరీరాన్ని చూపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు రామ్ చరణ్. ఈ మియామీలో "రచ్చ" కోసం రాంబోలా తన శరీరాన్ని కండలుతిరిగేలా అత్యంత నూతన వ్యాయామసూత్రాలను పాటిస్తూ చేస్తున్న వ్యాయామం వల్ల మరింత ఆకర్షణీయంగా తయారవుతున్నాడు రామ్ చరణ్.

రామ్ చరణ్ హీరోగా, మెగాసూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, "ఏమైంది ఈ వేళ " చిత్ర దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో, యన్ వి ప్రసాద్ ‍, పరాస్ జైన్ నిర్మిస్తున్న తన నాలుగవ చిత్రం "రచ్చ" కోసం తన శరీరాన్ని ఆ విధంగా మలచుకుంటున్నాడు రామ్ చరణ్. రాంబోలా తయారైన రామ్ చరణ్ తను నటించబోయే "రచ్చ" సినిమాలో ఏం రచ్చ రచ్చ చేస్తాడో వేచి చూడాలి. ఈ "రచ్చ" చిత్రం ఏప్రెల్ రెండవ వారంలో ప్రారంభం కాబోతోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.