English | Telugu
జపాన్ వల్ల అల్లు అర్జున్ హనీమూన్ పది రోజులకే పరిమితం
Updated : Mar 15, 2011
జపాన్ వల్ల అల్లు అర్జున్ హనీమూన్ పది రోజులకే పరిమితం కానుందట. నిజానికి అల్లు అర్జున్ తన హనీమూన్ భారీగానే ప్లాన్ చేశాడు. ఆసియా అంతా ఈ హనీమూన్ ట్రిప్పులో భార్యతో సహా తిరగాలని అల్లు అర్జున్ ప్లాన్ చేశాడట.
కానీ ఇటివల జపాన్ లో సంభవించిన సునామీ, భూకంపం, అగ్నిపర్వతాలు బ్రద్దలవ్వటం, అణు రియాక్టర్లు పేలిపోవటం వంటి ఉత్పాతాలు సంభవించటం మూలంగా తన హనీమూన్ ని అల్లు అర్జున్ కేవలం పదిరోజులకే పరిమితం చేసుకున్నాడు. అంటే అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలసి బయలుదేరిన హనీమూన్ ట్రిప్పులో జపాన్ కూడా ఉందట.
ప్రస్తుతం అక్కడి పరిస్థితులు చాలా ఆందోళనాకరంగా ఉండటంతో తన హనీమూన్ ట్రిప్పుని పది రోజులకే తగ్గించాల్సి వచ్చిందట. అవును మరి జపాన్ లో రేడియేషన్ వ్యాపించే ప్రమాదం చాలా హెచ్చుస్థాయిలో ఉంది. దీని వల్ల జపాన్ వెళ్ళలన్నా, ఆ పరిసర దేశాలకు వెళ్ళాలన్నా యాత్రికులు భయపడుతున్నారు. అందుకని అల్లు అర్జున్, స్నేహారెడ్డి తమ హనీ మూన్ ని యూరప్ లో ప్లాన్ చేసుకున్నారట.