English | Telugu

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాసు మూవీ

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాసు దర్శకత్వంలో ఒక మూవీ తయారవుతోందని విశ్వసనియ వర్గాల ద్వారా అందిన సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన "సింహా" వంటి బ్లాక్ బస్టర్ వంటి హిట్టిచ్చిన తర్వాత, దాసరి నారాయణరావు దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ హీరోగా "పరమవీరచక్ర" చిత్రంలో నటించారు.

ఇది నందమూరి బాలకృష్ణ ఇమేజ్ ని బాగా దెబ్బతీసింది. అలాగే నందమూరి బాలకృష్ణ అభిమానులను కూడా బాగా నిరాశపరిచింది. ఈ సినిమాలో నటించటం వల్ల నందమూరి బాలకృష్ణ సరైన నిర్ణయాలు తీసుకోకుండా, మొహవాటాలకు పోయి దాసరి వంటి వారి దర్శకత్వంలో నటించి ఫ్లాపులిస్తున్నారనీ, అందుకని నందమూరి బాలకృష్ణ యంగ్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేయాలని నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆశిస్తున్నారు. శ్రీవాసు గతంలో గోపీచంద్ హీరోగా "లక్ష్యం" చిత్రానికీ, రామ్ హీరోగా "రామ రామ కృష్ణ కృష్ణ" చిత్రానికి దర్శకత్వం వహించగా, మొదటి చిత్రం సూపర్ హిట్టయితే రెండవ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

అలాంటి శ్రీవాసు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఒక సినిమాలో నటించటానికి అంగీకరించారట. నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాసు దర్శకత్వంలో రాబోయే ఈ మూవీ ప్రస్తుతం కథా చర్చల్లో ఉంది. ఈ మూవీకి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.