English | Telugu

నాగచైతన్య "బెజవాడ రౌడీలు" నిర్మాతగా వర్మ

నాగచైతన్య హీరోగా నటిస్తున్న "బెజవాడ రౌడీలు" చిత్రానికి నిర్మాతగా వర్మ వ్యవహరిస్తున్నారనీ, ఈ చిత్రానికి వర్మ దర్శకత్వం వహించటం లేదనీ తెలిసింది. నిర్మాతగా వర్మ వ్యవహరిస్తున్న ఈ నాగచైతన్య "బెజవాడ రౌడీలు" చిత్రానికి వర్మ శిష్యుడు వివేక్ దర్శకత్వం వహిస్తారట.

రామ్ గోపాలవర్మ ఫిలిం ఫ్యాక్టరీనుంచి పుట్టిన మరోదర్శకుడు ఈ వివేక్. నిర్మాతగా వర్మ వ్యవహరిస్తున్న ఈ నాగచైతన్య "బెజవాడ రౌడీలు" చిత్రానికి సంబంధించి ఈ చిత్రం పేరు పలు వివాదాలకు దారి తీసింది. తమ నగరాన్ని అవమానిస్తున్నట్లుగా ఉందని గతంలో బెజవాడ నగర వాసులు గగ్గోలు పెట్టారు. వారు అలా గగ్గోలు పెట్టటం ఈ సినిమా తీయటానికి వర్మను మరింత ఉత్తేజితుణ్ణి చేసింది. దాంతో ఈ నాగచైతన్య "బెజవాడ రౌడీలు" చిత్రానికి శ్రీకారం చుట్టబడింది. బెజవాడలోని రెండు రౌడీ గ్రూపుల మధ్య జరిగిన గొడవల ఆధారంగా ఈ నాగచైతన్య "బెజవాడ రౌడీలు" చిత్రం కథ తయారుచేయబడిందని సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.