ఎన్టీఆర్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర'. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ లో జరిగిన మొదటి షెడ్యూల్ లో తారక్, సైఫ్ పై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కి చిన్న బ్రేక్ ఇచ్చిన తారక్, ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్లి కూడా ఆయన 'దేవర' కోసం కష్టపడుతుండటం విశేషం.