Read more!

English | Telugu

వర్మ, నాగచైతన్యల బెజవాడ రౌడీలు మార్చ్ 21 నుంచి

వర్మ "బెజవాడ రౌడీలు" మార్చ్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ వర్మ "బెజవాడ రౌడీలు" చిత్రంలో అక్కినేని వంశంలో మూడో తరం యువ హీరో నాగచైతన్య హీరోగా నటించనున్నాడు. ఈ వర్మ"బెజవాడ రౌడీలు" చిత్రంలో కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు కూడా ఒక ముఖ్య పాత్రలో నటించనున్నారని తెలిసింది.

 

ఈ వర్మ "బెజవాడ రౌడీలు" చిత్రంలో విజయవాడలో రెండు గ్రూపుల మధ్య జరిగిన పోరాటాన్ని వర్మ "బెజవాడ రౌడీలు" చిత్రానికి కథగా ఎంచుకున్నారని సమాచారం. వాటిలో ఒకటి వంగవీటి రాధా వర్గం కాగా మరొకటి దేవినేని నెహ్రూ వర్గం. ఈ రెండు వర్గాల ఆధిపత్యపోరు విజయవాడలో ఇప్పటికీ సాగుతోంది. ఈ పోరులో అనేకమంది హత్యచేయబడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.

 

వర్మ "బెజవాడ రౌడీలు" చిత్రాన్ని మార్చ్ 21 వ తేదీ నుండి ప్రారంభించి కంటిన్యూస్ గా సింగిల్ స్కెడ్యూల్లో పూర్తిచేయనున్నారు. ఈ వర్మ "బెజవాడ రౌడీలు" టైటిల్ విన్నప్పుడే విజయవాడ నుండి చాలా విమర్శలు వినపడ్డాయి. మరి ఈ వర్మ "బెజవాడ రౌడీలు" పూర్తయి విడుదలయ్యాక ఇంకెన్ని గొడవలవుతాయో వేచి చూడాలి.