Read more!

English | Telugu

"తీన్ మార్" ఆడియో శిల్పకళా వేదికపై

"తీన్ మార్" చిత్రం ఆడియో శిల్పకళా వేదికపై జరుగనుంది. "తీన్ మార్" చిత్రం ఆడియో విడుదల ఎక్కడ జరుగుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇదొక శుభవార్త.

 

ఎట్టకేలకు హైదరాబాద్ మాదాపూర్ లో కల, శిల్పారామం లోకల శిల్పకళా వేదికపై, "తీన్ మార్" ఆడియో విడుదల కానుంది. ఈ "తీన్ మార్" చిత్రం ఆడియో విడుదల కోసం అనేక రకాల ప్రదేశాలను చూసి చివరికి శిల్పకళా వేదికను ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని "తీన్ మార్" చిత్ర నిర్మాత గణేష్ మీడియాకు తెలిపారు. మణిశర్మ ఈ "తీన్ మార్" చిత్రం ఆడియోకి చాలా మంచి సంగీతం అందించారని సమాచారం.

 

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన త్రిష కృష్ణన్, కృతి కర్బందా హీరోయిన్లుగా నటిస్తూండగా, జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. ఈ"తీన్ మార్" చిత్రం ఆడియో విడుదలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేలాదిగా తరలి వస్తారని ఈ "తీన్ మార్" చిత్ర నిర్మాత గణేష్ తెలియజేశారు.