English | Telugu
ఉరిమిలో జెనీలియా మార్షల్ ఆర్ట్
Updated : Mar 14, 2011
ఉరిమిలో జెనీలియా మార్షల్ ఆర్ట్ అంటే మనకు మాములుగా తెలిసిన జెనీలియా హాసిని పాపలాగ చిరునవ్వులు చిందిస్తూ ముచ్చటగా కనిపించింది. కానీ విచిత్రం కాకపోతే ఈ ఉరుముతానంటం ఏమిటి...? మరి నిజంగానే జెనీలియా మార్షల్ ఆర్ట్ తో ఇరగదీస్తానంటోంది.
మళయాళ, తమిళ, హిందీ భాషల్లో నిర్మించబడుతున్న "ఉరిమి" అనే చిత్రంలో జెనీలియా యుద్ధ సైనికురాలి పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర కోసం జెనీలియా మళయాళ మార్షల్ ఆర్ట్ కరిపట్టు అనే యుద్ధాన్ని కూడా నేర్చుకుంది. ఈ "ఉరిమి" సినిమా కోసం మానసికంగా, శారీరకంగా కూడా జెనీలియా చాలా కష్టపడుతోందట.
ఈ చిత్రంలో జెనీలియా నటనకు అవార్డులు వచ్చే అవకాశం ఉంటుందని, అలాగే చాలా రివార్డులు కూడా వస్తాయనీ ఈ చిత్రం యూనిట్ అంటోంది. ఏమైనా మనకు "బొమ్మరిల్లు" చిత్రంలో హాసిని పాపగా కనిపించిన జెనీలియాకి, శశిరేఖా పరిణయంలో కనిపించిన జెనీలియాకి, ఈ "ఉరిమి" చిత్రంలో కనిపించబోయే మార్షల్ ఆర్ట్ నేర్చిన యుద్ధ సైనికురాలికీ ఈ ఫొటోలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది కదూ.