Read more!

English | Telugu

తెలుగువన్ రేడియోని మెచ్చుకున్న అల్లు శిరీష్

తెలుగువన్ రేడియోని అల్లు శిరీష్ మెచ్చుకున్నారు. విషయంలోకి వెళితే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కనిష్టపుత్రుడు, ప్రముఖ యువ హీరో అల్లు అర్జున్ సోదరుడు అయిన అల్లు శిరీష్ కి ఒకరోజు ఇంటర్ నెట్ లో చక్కని తెలుగు పాటలు వినాలనిపించిందట.

 

దానికోసం తెలుగు పాటల ఆన్ లైన్ రేడియోలు ఏమున్నాయా అని వెతుకుతుంటే అల్లు శిరీష్ కి టోరీ అంటే "తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్ నెట్" లభించిందట. తెలుగువన్ రేడియోలోని పాటలూ, ఆర్ జెలూ, ప్రోగ్రాములూ, అల్లు శిరీష్ కి అంతా బాగా నచ్చాయట. ఆ విషయాన్ని తన ట్విట్టర్‍ లో పోస్ట్ చేశారు అల్లు శిరీష్.

 

మరి తెలుగువన్ రేడియో కదా... అందరికీ నచ్చినట్లే అల్లు శిరీష్ గారికి కూడా బాగా నచ్చింది. థ్యాక్స్ శిరీష్ ఫర్ లిజనింగ్ టోరీ అంటే "తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్ నెట్". ఇరవై నాలుగ్గంటల ఇంటర్నెట్ గ్లోబల్‍ రేడియో.