English | Telugu
గురూజీ సలహాలను ఫాలో అయిపోతున్న టిల్లు
Updated : Sep 18, 2023
సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం టిల్లు స్క్వేర్. గత ఏడాది డీజే టిల్లు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్‌గా టిల్లు స్క్వేర్‌ను తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ కూడా మారిపోయారు. సీక్వెల్‌ను మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు ప్రకటించినప్పటికీ ఆ తేదీలు మారుతూ వచ్చాయి. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ సిద్దమైంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా విడుదల డేట్ అక్టోబర్ 6 అన్నారు. మళ్లీ ఏమైనా వెనక్కి వెళుతుందేమో తెలియదు. అయితే రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ కాపీని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ చూశారట. ఆయన కొన్ని సలహాలు సూచనలు చేయటంతో ఇప్పుడు మళ్లీ రీ షూట్స్ జరుగుతున్నాయని టాక్.
ఈ మూవీలో త్రివిక్రమ్ పార్ట్‌నర్ అనేది అందరికీ తెలిసిందే. ఇందులో రూపొందే సినిమాలపై మాటల మాంత్రికుడు ప్రత్యేకమైన కేర్ తీసుకుంటుంటారు. అందులో భాగంగానే టిల్లు స్క్వేర్ సినిమాను చూసి కరెక్షన్స్ చెప్పారట. ఈ సినిమాపై సిద్దు జొన్నలగడ్డ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అలాగే ఇండస్ట్రీలోనూ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఓ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
టిల్లు స్క్వేర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య మూవీని నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల, రామ్ మిర్యాల దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. డీజే టిల్లులో హీరోయిన్‌గా నటించిన నేహా శెట్టి దీనిలో లేదు. అందుకు చాలా ట్రోల్స్ వచ్చినప్పటికీ ఫ్రెష్ స్టోరీతో టిల్లు స్క్వేర్ రన్ అవుతుందని, అందుకనే తనను సినిమాలో తీసుకోలేదని నేహా శెట్టి ఇంటర్వ్యూస్‌లో వివరణ ఇచ్చింది.