English | Telugu

బాబు కోసం జాబ్‌ వదిలెయ్యండి : ఐటి ఉద్యోగులకు బండ్ల గణేష్‌ పిలుపు

నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌, రిమాండ్‌ వ్యవహారం రోజురోజుకీ సంచలనంగా మారుతోంది. ఆయన అరెస్ట్‌ అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని పలువురు విమర్శలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంపై నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంతేకాదు పార్లమెంట్‌లో సైతం ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ స్పందిస్తూ ‘చంద్రబాబు జాతీయ సంపద, ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. చంద్రబాబు పేరు చెప్పుకొని ఎంతో మంది బాగుపడ్డారు. ఆయన్ని అరెస్ట్‌ చేయడం నన్నెంతగానో బాధించింది. ఆ బాధతోనే నేను ఇంట్లో వినాయక చవితి వేడుకలు కూడా జరుపుకోలేదు’ అని అంటూ ‘ఐటి రంగం అభివృద్ధి కోసం చంద్రబాబు చేసిన కృషి మామూలుది కాదు. పార్కుల ముందు, రోడ్ల మీద ధర్నాలు చేయడం కాదు. ఐటి ఉద్యోగులు నెలరోజులు ఉద్యోగాలు మానేసి సొంత ఊళ్ళకు వెళ్ళి బొడ్రాయి ముందు కూర్చొని ధర్నాలు చేయాలి. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా టిడిపి ఘనవిజయం సాధిస్తుంది. మరోసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు’ అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.