English | Telugu

ఇద్ద‌రు స్టార్స్‌తో రూ.1500 కోట్లు టార్గెట్ చేసిన అట్లీ

సౌత్ సినీ ఇండ‌స్ట్రీ నుంచి వ‌స్తోన్న డైరెక్ట‌ర్స్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో అద‌ర‌గొట్టే సినిమాల‌ను చేస్తున్నారు. ఆ కోవ‌లో స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ కూడా జాయిన్ అయ్యారు. ఆయ‌న తెర‌కెక్కించిన జ‌వాన్ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మూవీ 11 రోజుల్లో రూ.858 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. త్వ‌ర‌లోనే వెయ్యి కోట్ల మార్కును సాధిస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్లు వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాల్లో హీరోగా న‌టించిన ఘ‌న‌త షారూఖ్ ఖాన్‌కే ద‌క్కుతుంద‌ని ఆయ‌న అభిమానులు సంబ‌ర‌ప‌డుతున్నారు. డైరెక్ట‌ర్ అట్లీపై అంద‌రూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో అట్లీ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు నెట్టింట వైర్ అవుతున్నాయి. ఇంత‌కీ ఆయ‌న ఎలాంటి కామెంట్స్ చేశార‌నే వివ‌రాల్లోకి వెళితే, బాలీవుడ్ బాద్ షా షారూఖ్‌, ద‌ళ‌ప‌తి విజ‌య్ కాంబోలో మ‌ల్టీస్టార‌ర్ ఎప్పుడు చేయ‌బోతున్నారంటూ బాలీవుడ్ మీడియా ప్ర‌శ్నించిన దానికి అట్లీ ఏమాత్రం త‌డుముకోకుండా క‌చ్చితంగా ఇద్ద‌రితో క‌లిసి సినిమా తీస్తాను. వారిద్ద‌రికీ స‌రిపోయే క‌థ‌ను భ‌విష్య‌త్తులో నేనే రాస్తాను అని అట్లీ అన్నారు. అంతే కాకుండా త‌న కెరీర్‌లో గొప్ప సినిమాల‌ను ఇచ్చిన క్రెడిట్ వారిద్ద‌రికే ద‌క్క‌తుఉంద‌ని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా వారిద్ద‌రూ క‌లిస్తే రూ.1500 కోట్ల‌ను మించి వ‌సూళ్లు వ‌స్తాయ‌ని ఈ సంద‌ర్భంగా అట్లీ పేర్కొన‌టం విశేషం.

నిజానికి జ‌వాన్ మూవీలోనే ద‌ళ‌ప‌తి విజ‌య్ గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపించాయి. కానీ ఆ వార్త‌ల‌న్నీ అవాస్త‌వాల‌ని రిలీజ్ త‌ర్వాత తెలిసింది. జ‌వాన్‌లో షారూఖ్ ఖాన్ ద్విపాత్రాభియం చేశారు. దీపికా ప‌దుకొనె, న‌య‌న‌తార హీరోయిన్స్‌గా న‌టించ‌గా మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా న‌టించి మెప్పించారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో రిలీజై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .